Share News

- MLA Kalava Srinivasulu తాగునీటి సమస్య రాకుండా చూస్తాం

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:41 PM

తాము అధికారంలోకి ఉన్నంత వరకు రాయదుర్గం పట్టణాని కి తాగునీటి సమస్య రాకుండా చూస్తామని ఎమ్మెల్యే కాలువ ల శ్రీనివాసులు భరోసా ఇ చ్చారు. మండల కేంద్రంలో గ ల సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు ఆదివారం ఆయన అధికారికంగా పూజలు చేసి హెచ్చెల్సీ నీటిని విడుదల చేశారు.

- MLA Kalava Srinivasulu   తాగునీటి సమస్య రాకుండా చూస్తాం
ఎస్‌ఎస్‌ ట్యాంకు వద్ద పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కాలవ

- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

కణేకల్లు, జూలై 28 : తాము అధికారంలోకి ఉన్నంత వరకు రాయదుర్గం పట్టణాని కి తాగునీటి సమస్య రాకుండా చూస్తామని ఎమ్మెల్యే కాలువ ల శ్రీనివాసులు భరోసా ఇ చ్చారు. మండల కేంద్రంలో గ ల సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు ఆదివారం ఆయన అధికారికంగా పూజలు చేసి హెచ్చెల్సీ నీటిని విడుదల చేశారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో రాయదుర్గం పట్టణవాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇప్పటి నుండి అలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తల చర్యలు చేపడతామన్నారు. 80 వేల జనాభాకు అవసరమైన నీటిని ఇచ్చేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తామన్నారు. అలాగే రూ. 32 కోట్లతో నూతన పైప్‌లైన ఏర్పాటుకు కూడా ప్రభుత్వానికి నివేదికను అందిచామన్నారు. గతంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన పనుల్లో నాణ్యత కొరవడడంతో పలుసార్లు మరమ్మతులకు గురై పట్టణవాసులు తాగునీటి కోసం ఇబ్బంది పడ్డారన్నారు. భవిష్యత్తులో ఇలాంటికి మళ్లీ రాకుండా ఉండాలని ముందు జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. నీటి పంపింగ్‌ విషయంలో విద్యుత, మున్సిపల్‌ అధికారులకు వస్తున్న సమస్యను సమన్వయం చేసి ఇరువురి మధ్య ఇబ్బందులు రాకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన పొరాళు శిల్ప, మున్సిపల్‌ డీఈ సురేష్‌, టీడీపీ నాయకులు టంకశాల హనుమంతు, కడ్డిపూడి మాబు, పొరాళు పురుషోత్తం, బండి భారతి, కౌన్సిలర్‌ ప్రశాంతి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 28 , 2024 | 11:41 PM