Share News

జిల్లేడుబండ నిర్వాసిత రైతులకుపరిహారం అందిస్తాం

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:32 AM

ముదిగుబ్బ, ఏప్రిల్‌ 12: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లేడుబండ ప్రాజెక్టు ముంపు రైతులకు పరిహారం అందిస్తామని హిందూపురం పార్లమెంట్‌ కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి తెలిపారు.

 జిల్లేడుబండ నిర్వాసిత రైతులకుపరిహారం అందిస్తాం

ముదిగుబ్బ, ఏప్రిల్‌ 12: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లేడుబండ ప్రాజెక్టు ముంపు రైతులకు పరిహారం అందిస్తామని హిందూపురం పార్లమెంట్‌ కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కూటమి పార్టీల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లేడుబండ ప్రాజెక్టు ముంపు రైతుల సమస్య పరిష్కారంతో పాటు, ముదిగుబ్బలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా ద్వారా గొల్లపల్లి, మారాలా రిజర్వాయర్లను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. కియా పరిశ్రమ తెచ్చి 50 వేల ఉద్యోగాలు అందించిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలుపించాలని కోరారు. కూటమితోనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందన్నారు. వైసీపీని ఇంటికి సాగనంపుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కదిరి మాజీ శాసన సభ్యుడు ఎమ్మెస్‌ పార్థసారథి, టిడిపి నాయకలు, బిజేపి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:32 AM