rdo నాణ్యమైన సరుకులను అందిస్తాం: ఆర్డీఓ
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:34 AM
ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను అందజేస్తామని ఆర్డీఓ వెంకటశివరామిరెడ్డి పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం ఆయన ధర్మవరం, ముదిగుబ్బ, చెన్నేకొత్తపల్లి స్టాక్ పాయింట్లను తనిఖీ చేసి అందులోని కందిపప్పు, నూనెను పరిశీలించారు. అలా గే చక్కెర నిల్వ రిజిస్టర్‌ను పరిశీలించారు.

ధర్మవరం, జూన 16: ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను అందజేస్తామని ఆర్డీఓ వెంకటశివరామిరెడ్డి పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం ఆయన ధర్మవరం, ముదిగుబ్బ, చెన్నేకొత్తపల్లి స్టాక్ పాయింట్లను తనిఖీ చేసి అందులోని కందిపప్పు, నూనెను పరిశీలించారు. అలా గే చక్కెర నిల్వ రిజిస్టర్‌ను పరిశీలించారు.
ఎక్కడ ఎటువంటి పొరపాటు లేకుండా చూడాలని స్టాక్‌పాయింట్ సిబ్బందికి సూచించారు. అనంతరం మా ట్లాడుతూ రేషన కార్డు లబ్ధిదారులకు చౌకదుకాణాల్లో నాణ్యమైన సరుకులను అందజేస్తామని తెలిపారు. ఆర్డీఓ వెంట అధికారులు లక్ష్మీదేవి, శారద, రమాదేవి, హంపయ్య, ఈశ్వరయ్య ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...