Share News

నీరుగారిన క్రీడలు

ABN , Publish Date - May 22 , 2024 | 12:30 AM

నగరానికి ఉన్న ఏకైక ఇండోర్‌స్టేడియం వర్షం కారణంగా మూసివేశారు. వర్షంతో ఇండోర్‌స్టేడియం మొత్తం వర్షం నీరు లీకై తడిసిపోయింది.

నీరుగారిన క్రీడలు
ఇండోర్‌లో మ్యాట్లపై నిల్వ ఉన్న వాన నీరు

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 21: నగరానికి ఉన్న ఏకైక ఇండోర్‌స్టేడియం వర్షం కారణంగా మూసివేశారు. వర్షంతో ఇండోర్‌స్టేడియం మొత్తం వర్షం నీరు లీకై తడిసిపోయింది. ఇండోర్‌స్టేడియంలో ప్రతి నిత్యం షటిల్‌ బ్యాడ్మింటన, ఫెన్సింగ్‌, కబడ్డీ, టేబుల్‌ టెన్నీస్‌, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారులు సాధన చేస్తుంటారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి స్టేడియం మొత్తం వర్షం నీటితో నిండిపోయింది. మరోవైపు ఇండోర్‌స్టేడియం పైకప్పు శిథిలావస్థకు చేరడంతో నీరంతా లోపలికి చేరంది.


షటిల్‌ మ్యాట్‌ మొత్తం తడిసిపోయింది. మరోవైపు వర్షంతో షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలే వేసవి సెలవుల్లో క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్న క్రీడాకారులకు ఇండోర్‌ స్టేడియంలోకి వర ్షం నీరు వచ్చి, మూసి వేయడం నిరాశ కలిగిస్తోంది. వర్షపు నీరు నిల్వ, చీకట్లతో ఇండోర్‌స్టేడియం దీనావస్థలో ఉండిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇండోర్‌స్టేడియం మరమ్మత్తులు చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.

Updated Date - May 22 , 2024 | 12:32 AM