Share News

పోలింగ్‌ ముగిసిందనే జీతాలివ్వలేదా?

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:22 AM

ఈనెల మరిచిన ప్రభుత్వంఅనంతపురం సెంట్రల్‌, జూన 3: ఐదేళ్లుగా జీతాలకోసం ఎదురుచూసేట్టు చేసిన వైసీపీ ప్రభుత్వం.. గత మే నెల మాత్రం ఒకటో తేదీనే ఠంచనుగా వేతనాలు జమచేసింది. అయితే ఈనెల మాత్రం మరిచిపోయిందని జేఎనటీయూ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓటు వేసేశారు,

పోలింగ్‌ ముగిసిందనే జీతాలివ్వలేదా?

ఫ గత నెలలో ఒకటో తేదీనే వేతనాలు

ఫ ఈనెల మరిచిన ప్రభుత్వంఅనంతపురం సెంట్రల్‌, జూన 3: ఐదేళ్లుగా జీతాలకోసం ఎదురుచూసేట్టు చేసిన వైసీపీ ప్రభుత్వం.. గత మే నెల మాత్రం ఒకటో తేదీనే ఠంచనుగా వేతనాలు జమచేసింది. అయితే ఈనెల మాత్రం మరిచిపోయిందని జేఎనటీయూ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓటు వేసేశారు, ఎన్నికలు ముగిసిపోయాయని ఇక వారితో పనేంటని ప్రభుత్వం జీతాలివ్వలేదని మండిపడుతున్నాయి. ఏరు దాటి తెప్పను తగలేసినట్లుగా ప్రభుత్వ తీరు మారిందని వాపోతున్నాయి. గల్లాపెట్టె ఖాళీచేసి అప్పులు తీసుకువచ్చిన తరువాత తమ జీతాలు జమజేయడం అలవాటుగా చేసుకున్న ప్రభుత్వం ఎన్నికల అనంతరం చేతులెత్తేసిందని మండిపడుతున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడబోయే ప్రభుత్వమే జీతాలు ఇచ్చుకుంటుందన్న భావనతో విస్మరిస్తోందని అంటున్నాయి. రెండు, మూడు నెలలకు ఒకసారి జీతాలివ్వడం అలవాటుచేసుకున్న వైసీపీ ప్రభుత్వం.. మే నెల మాత్రమే ఒకటో తేదీన జమచేయడం ఇందుకు నిదర్శనమంటున్నాయి.

అధికార ముసుగు...

జేఎనటీయూ ఉన్నతాధికారులు కొంతమంది వైసీపీకి భజనపరులుగా మారిపోయి తమ సంక్షేమాన్ని విస్మరించారని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. జీతాలివ్వాలని కోరినప్పుడల్లా ట్రెజరీలో పెండింగ్‌, సీఎ్‌ఫఎంఎ్‌సలో ఉన్నాయి, రీజర్వ్‌బ్యాంక్‌ ఓకే చేయాలి ఇలా అనేక సాకులు చెప్పారంటూ గుర్తుచేసుకుంటున్నాయి. అదే అధికారులే.. మే నెలలో జీతాల్వికపోతే ఉద్యోగులు ఓటు ద్వారా వారి ప్రతాపాన్ని చూపుతారని ట్రెజరీ, సీఎఎ్‌ఫఎం శాఖలతో మాట్లాడి వేతనాలు జమ చేయించారని పేర్కొంటున్నాయి. అదే చొరవ గతంలోనూ, ప్రస్తుతం ఎందుకు చూపలేకపోయారని ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగుల సంక్షేమం కన్నా వారి పదవులే ముఖ్యమన్న రీతిలో వ్యహరించారని మండిపడుతున్నాయి.

Updated Date - Jun 04 , 2024 | 12:22 AM