Share News

అభివృద్ధి చేసేవారికే ఓటెయ్యండి

ABN , Publish Date - May 12 , 2024 | 12:43 AM

‘అభివృద్ధి చేసేవారికే ఓటేయ్యండి... 2014-19 వరకు నా పాలన చూశారు... 2019 నుంచి ఇప్పటి వరకు ప్రకాశ రెడ్డి పాలన చూశారు.. మీకు ఎవరు న్యాయం చేశారో.. ఎవరు అభివృద్ధి చేశారో.. ఆలోచించి ఓటేయ్యండి.. ’ అని కూటమి రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి పరిటాల సునీత ఓటర్లకు సూచించారు.

అభివృద్ధి చేసేవారికే ఓటెయ్యండి
The women who participated in the Paritala Sunitha campaign

రామగిరి, మే 11: ‘అభివృద్ధి చేసేవారికే ఓటేయ్యండి... 2014-19 వరకు నా పాలన చూశారు... 2019 నుంచి ఇప్పటి వరకు ప్రకాశ రెడ్డి పాలన చూశారు.. మీకు ఎవరు న్యాయం చేశారో.. ఎవరు అభివృద్ధి చేశారో.. ఆలోచించి ఓటేయ్యండి.. ’ అని కూటమి రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి పరిటాల సునీత ఓటర్లకు సూచించారు. శనివారం ఎన్నికల చివరి ప్రచారంలో భాగంగా ఆమె సొంత మండలమైన కొత్తగాదికుంట, మాదా పురం, నసనకోట, ముత్యాలంపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో పూలవర్షంతో.. మంగళహారతులతో ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ప్రచారంలో తెలంగాణ టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న పాల్గొన్నారు. పరిటాల సునీత మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, అయితే ప్రజలు గత ఎన్నికల్లో ప్రకాశరెడ్డినే గెలిచించడం చాలా బాధకల్గిం చిందని అన్నారు. ఈ ఐదేళ్లలో జానెడు రోడ్డు వేయని, ఒక్క చెరువుకైనా నీరు ఇవ్వని ప్రకాశరెడ్డిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. పైగా కర్ణాటక నుంచి జనాన్ని తీసుకువచ్చి ఇక్కడ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. గతంలో తోపు కుటుంబసభ్యులు పరిటాల రవీంద్ర దగ్గర చెంప దెబ్బతిన్న సంఘటన మరచిపోవద్దని హెచ్చరించారు. తాము గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుం టున్నామని, చిచ్చుపెట్టి రాజకీయాలు చేయడం తమకు రాదని అన్నారు. ఇన్ని రోజులు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డ తోపు... జూన 4న తర్వాత మాజీ ఎమ్మెల్యే అవుతారని ధీమా వ్యక్తం చేశారు.


భూదోపిడీకే ల్యాండ్‌ టైటిలింగ్‌

ప్రజలు భూములను లాక్కొడానికి జగనరెడ్డి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొస్తున్నారని, ఈ సారి ఆయన గెలిస్తే ఇక వైసీపీ నాయకుల భూ దోపిడీకి హద్దే ఉండదని పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం నసనకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ల్యాండ్‌ టైటిలింగ్‌ ప్రతులను దగ్ధం చేశారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాప్తాడు నియోజకవర్గంలో భూదోపిడీలు సాగాయని, ఇక ఇలాంటి చట్టం వస్తే ప్రకాశ రెడ్డి సోదరులు లాంటి వారి దౌర్జ న్యాల కు హద్దే ఉండబోదని అన్నారు. ఈ సారి వైసీపీ అధికారంలోకి వస్తే సొంత ఆస్థులకు కూడా రక్షణ లేకుండా పోతుందన్నారు.


ఆగని వలసలు

అనంతపురంరూరల్‌ :చివరి రోజు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఆగలేదు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి, నామాల, రామగిరి మండలం ముత్యాలంపల్లి, కనగానపల్లి మండలం నరసంపల్లి, ఆత్మకూరు మండలం పాపంపల్లి, గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌, పరిటాల సిద్ధార్థ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వా నించారు. పరిటాల సునీత మట్లాడుతూ.. ఇంకా వైసీపీలో ఉన్న వారు కూడా అసంతృప్తితోనే ఉన్నారని, వారు టీడీపీలోకి రాకపోయినా.. ఎన్నికల్లో ఓటు ద్వారా ఎమ్మెల్యే సోదరులకు బుద్ధి చెప్తారన్నారు.


జోరుగా ప్రచారం...

రాప్తాడు / రామగిరి : రాప్తాడు మండలం లోని అయ్యవారిపల్లిలో మండల ఇనచార్జ్‌ ధర్మవరపు మురళి సతీమణి ధర్మవరపు ధనలక్ష్మి, కుమారుడు ధర్మవరపు చేతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే రామగిరి మండలంలో పరిటాల కోడళ్లు పరిటాల జ్ఞాన, పరిటాల తేజస్విని ప్రచారం నిర్వహించారు. తమ స్వగ్రామమైన వెంకటా పురంలో పరిటాల సునీతతో పాటు పెద్దకోడ లు పరిటాల జ్ఞాన, అదేవిధంగా కొండాపురం పంచాయతీలోని గ్రామాల్లో చిన్నకోడలు పరిటాల తేజస్విని ప్రచారం నిర్వహించారు.

Updated Date - May 12 , 2024 | 12:43 AM