వైసీపీ సమావేశంలో వలంటీర్లు, ఎంఎల్‌ఓ
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:58 PM
వైసీపీ సమావేశంలో వలంటీర్లు, ఎంఎల్‌ఓలు పాల్గొనడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
బొమ్మనహాళ్, ఫిబ్రవరి 6: వైసీపీ సమావేశంలో వలంటీర్లు, ఎంఎల్‌ఓలు పాల్గొనడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో మంగళవారం వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం వైసీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాయదుర్గం సమన్వయకర్త, ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారంపై నాయకులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో వైసీపీ కార్యకర్తల తో పాటు మండలంలోని శ్రీధరఘట్ట, ఉద్దేహాళ్ గ్రామాలకు చెందిన వలంటీర్లు, కణేకల్లు ఎంఎల్‌ఓ నుంకేష్, ప్రభుత్వ వైన్సషా్‌పలో పనిచేసే సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. దీన్ని గమనించిన వారు వలంటీర్ వ్యవస్థను జగన ప్రభుత్వం తమ పార్టీ కార్యక్రమాలకు యథేచ్ఛగా వాడుకుంటోందని విమర్శిస్తున్నారు. అసలు వలంటీర్లు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా, లేక వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.