Share News

GRAMA SABHA : దేశాభివృద్ధికి పల్లెలు పట్టుగొమ్మలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:12 AM

దేశాభివృద్ధిలో పల్లె పట్టుకొమ్మలాంటి దని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శుక్రవారం చేపట్టిన గ్రామసభల్లో స్థానిక ప్రజాప్రతినిధు లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ పల్లెలు అభివృద్ధి చెందినరోజే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకు పల్లె ల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పల్లెల అభివృ ద్ధి గాలికి వదిలారన్నారు. దీనివల్ల ఏ గ్రామంలో చూసినా సమస్యలు తాండవిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉం చుకుని ఉప ముఖ్యమంత్రి గ్రామాలాభివృద్దిపై దృష్టిసారించారన్నారు.

GRAMA SABHA : దేశాభివృద్ధికి పల్లెలు పట్టుగొమ్మలు
People attending the Gram Sabha in Pulkunta

అధికారులు, నాయకుల వెల్లడి

గ్రామసభలకు పోటెత్తిన జనం

హిందూపురం, ఆగస్టు 23 : దేశాభివృద్ధిలో పల్లె పట్టుకొమ్మలాంటి దని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శుక్రవారం చేపట్టిన గ్రామసభల్లో స్థానిక ప్రజాప్రతినిధు లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ పల్లెలు అభివృద్ధి చెందినరోజే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకు పల్లె ల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పల్లెల అభివృ ద్ధి గాలికి వదిలారన్నారు. దీనివల్ల ఏ గ్రామంలో చూసినా సమస్యలు తాండవిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉం చుకుని ఉప ముఖ్యమంత్రి గ్రామాలాభివృద్దిపై దృష్టిసారించారన్నారు. ఈ సందర్బంగా గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన వివిధ అంశాలపై గ్రామసభ ల్లో చర్చించారు. గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజల సహకారం ఉంటేనే గ్రామాభివృద్ధి సాధ్యం అవుతుంద న్నారు. అలాగే గోరంట్ల, పెనుకొండ రూరల్‌, సోమందేపల్లి, చిలమత్తూరు, అగళి, గుడిబండ, రొళ్ల, అమరాపురం తదితర మండలాల్లోని అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. మండల స్థాయి అధికారులు, టీడీపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 24 , 2024 | 12:12 AM