Share News

మున్సిపల్‌ కార్యాలయంలో విజిలెన్స తనిఖీలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:53 AM

స్థానిక మునిసిపల్‌ కార్యాలయాన్ని విజిలెన్స అధికారి డీసీటీఓ విజయలక్ష్మి, ఏఈ రాజశేఖర్‌, ఏజీ శివప్రసాద్‌, పోలీసు సిబ్బంది చంద్ర శుక్రవారం తనిఖీ చేశారు.

మున్సిపల్‌ కార్యాలయంలో విజిలెన్స తనిఖీలు
రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు

పుట్టపర్తి, ఆగస్టు 23 : స్థానిక మునిసిపల్‌ కార్యాలయాన్ని విజిలెన్స అధికారి డీసీటీఓ విజయలక్ష్మి, ఏఈ రాజశేఖర్‌, ఏజీ శివప్రసాద్‌, పోలీసు సిబ్బంది చంద్ర శుక్రవారం తనిఖీ చేశారు. నెల రోజులు తిరక్కుండానే విజిలెన్స అధికారులు మరోసారి ఆ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేయడం విశేషం. దీంతో ఒక పక్కన సిబ్బంది, మరో పక్కన పాలకవర్గం హడలిపోయారు. వాహనాల మరమ్మతులు, డీజిల్‌ కొనుగోలు బిల్లులు, సత్యసాయి జయంతి వేడుకల్లో నిధుల ఖర్చులకు సంబంధించిన రికార్డులు, కొళాయి పన్నుల బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్‌ అంజయ్య, సిబ్బందిని విచారించారు.


మూడేళ్లలో చేసిన ఖర్చుల న్నింటిపై ఆరాతీసినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమైనట్లు తెల్సింది. డీసీటీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. స్థానికంగా కొంతమంది అమరావతి మునిసిపల్‌ పరిపాలన విభాగానికి ఫిర్యాదు చేయడంతోనే ఈ తనిఖీలు చేపట్టామని, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:53 AM