Share News

వార్డుల్లో పట్టు సాధిస్తేనే గెలుపు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:37 AM

మునిసిపాలిటీలో అన్ని వార్డుల్లో పట్టు సాధించి, ఆధిక్యత చేజిక్కించుకున్నప్పుడే గెలుపు సునాయాసమౌతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు.

వార్డుల్లో పట్టు సాధిస్తేనే గెలుపు
మాట్లాడుతున్న గుమ్మనూరు జయరాం

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జయరాం

గుంతకల్లు, ఏప్రిల్‌ 19: మునిసిపాలిటీలో అన్ని వార్డుల్లో పట్టు సాధించి, ఆధిక్యత చేజిక్కించుకున్నప్పుడే గెలుపు సునాయాసమౌతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం ఉదయం కసాపురం రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో వార్డు ఇన్చార్జిలు, బూత-యూనిట్‌-క్లస్టర్‌ ఇన్చార్జుల సమావేశాన్ని నిర్వహించారు. పలువురు పార్టీ నాయకుల అభిప్రాయాలను జయరాం తీసుకున్నారు. వార్డు ఇన్చార్జులతో కలసి సమష్టిగా ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించినప్పుడే ప్రతి వార్డులో ఆధిక్యం సాధించగలమని అన్నారు. సమన్వయంతో పనిచేసి అనుకున్నది సాధిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్‌ పవన కుమార్‌ గౌడు, గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు నారాయణ, బండారు ఆనంద్‌, కేసీ హరి, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, గుమ్మనూరు వెంకటేశులు, తలారి సరోజమ్మ, తలారి మస్తానప్ప, కృపాకర్‌, గుడిపాటి ఆంజనేయులు, కోడెల చంద్రశేఖర్‌, టీ కేశప్ప, పాల్గొన్నారు.

వెంకటరామి రెడ్డి ఓటమి తథ్యం: చేసిన అవినీతి పనుల కారణంగా రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వై వెంకటరామి రెడ్డి ఓడిపోవడం ఖాయమని గుమ్మనూరు జయరాం శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో అన్నారు. వెంకట రామిరెడ్డి అవినీతి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని కూడా తాకిందని, ఒక హోంగార్డు ట్రాన్సఫర్‌ కావాలన్నా ఎమ్మెల్యే అల్లుడితో భేటీ కావాల్సిందేనని ఆరోపించారు. పార్టీలో బీసీలు ఎదిగితే రాబోయే రోజుల్లో తన కుమార్తె రాజకీయ జీవితానికి అడ్డు ఏర్పడుతుందన్న కారణంతో వెనుకబడిన తరగతుల వారిని అణగక్కారని విమర్శించారు. ఎన్నికల్లో బీసీ నాయకులు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని అన్నారు. కూతురు, అల్లుడి అక్రమాల కారణంగా ఎన్నికల్లో వెంకట రామిరెడ్డి ఓటమి తథ్యమన్న అభిప్రాయం ప్రజల్లో స్థిరపడిపోయిందన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలపించాలి

గుంతకల్లుటౌన:గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం, అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు గెలపించాలని ముష్టూరు తిమ్మప్ప పిలుపునిచ్చారు. మండలంలోని పాతకొత్తచెరువు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రచారం నిర్వహించారు. కొండా నాగరాజు, శివయ్య, సుంకన్న, సురేష్‌, రాజు, యుగంధర్‌, భాస్కర్‌, సాంబశివుడు పాల్గొన్నారు.

టీడీపీలోకి 30 కుటుంబాలు

పామిడి: మండలంలోని కట్టకిందపల్లిలో 30 కుటుంబాలు మాజీ మంత్రి, గుంతకల్లు నియోజకవర్గ అభ్యర్థి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూ రు ఈశ్వర్‌, టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ పత్తి హిమబిందు కం డువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంగాధర్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:37 AM