Share News

మూడు రాజధానుల పేరుతో నిలువు దోపిడీ

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:07 AM

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముఖ్య మంత్రి జగన అండ్‌కో నిలువు దోపిడీ చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు మల తిప్పేస్వామి విమర్శించారు.

మూడు రాజధానుల పేరుతో నిలువు దోపిడీ
మాట్లాడుతున్న గుండుమల తిప్పేస్వామి

ఫ రాజధాని లేని రాష్ట్రం చేసిన ఘనత జగనదే

ఫ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి

మడకశిరటౌన, ఫిబ్రవరి 16: మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముఖ్య మంత్రి జగన అండ్‌కో నిలువు దోపిడీ చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు మల తిప్పేస్వామి విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టిన ఘన త సీఎం జగనదే అన్నారు. ఆయన శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి శూన్యమ న్నారు. దోచుకోవ డం, దాచుకోవడం తప్ప ముఖ్యమంత్రి చేసింది ఏమీలేదన్నారు. రాజధాని ఫైల్స్‌ సినిమాతో ముఖ్యమంత్రి జగన వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ఒక్క సినిమాను చూసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి భయపడటం ఇదే తొలిసారి అన్నారు. రాజధాని రైతుల బతుకు ఛిద్రం అంశంగా తీసిన సినిమాను అడ్డుకోవాలని చూడ టం ఈప్రభుత్వ నీచ సంస్కృతికి నిదర్శనం అన్నారు. అమ రావతి రైతుల ఉసురు ఊరికే పోదని, రాష్ట్రం కోసం ప్రజల కోసం తీసిన సినిమా ను సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి అడ్డుకోవడం దారుణం అన్నారు. సినిమా విడుదల అయితే తమ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందనే భయంతోనే వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందన్నారు. ముఖ్యమంత్రి జగనలో ఓటమిభయం పట్టుకుందని, ఇలాంటి విపరీత బుద్ధులే వినాశనానికి దారులు తీస్తాయన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని జోశ్యం చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు భక్తర్‌, నాయిబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, డాక్టర్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి, నాయకులు దాసిరెడ్డి ఉన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:07 AM