Share News

WATER : నిరుపయోగంగా నీటి ప్లాంట్లు

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:35 AM

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధ జలాలు అందిస్తూ మూతపడిన ఎన్టీఆర్‌ సుజలస్రవంతి నీటిశుద్ధి ప్లాంట్లను పునః ప్రాంభిం చాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో టీడీపీ ప్రభ్వుతం గ్రామీణ ప్రజల కు శుద్ధ తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం ద్వారా గ్రామాల్లో తాగునీటి ప్లాంట్లను ప్రాంభించింది. బిందె నీటిని రూ.2కే అందించేవారు. దీంతో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడే వారు కాదు.

WATER : నిరుపయోగంగా నీటి ప్లాంట్లు
Closed drinking water plant in Chandakachar

తాగునీటికి ఇబ్బందులు పడుతున్న గ్రామీణులు

పునఃప్రారంభించాలని విన్నపం

మడకశిర రూరల్‌, జూన 16: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధ జలాలు అందిస్తూ మూతపడిన ఎన్టీఆర్‌ సుజలస్రవంతి నీటిశుద్ధి ప్లాంట్లను పునః ప్రాంభిం చాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో టీడీపీ ప్రభ్వుతం గ్రామీణ ప్రజల కు శుద్ధ తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం ద్వారా గ్రామాల్లో తాగునీటి ప్లాంట్లను ప్రాంభించింది. బిందె నీటిని రూ.2కే అందించేవారు. దీంతో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడే వారు కాదు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది, చాల చోట్ల ప్లాంట్లు మూడపడ్డాయి.తున్నారు.


ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మూతపడి న ప్లాంట్లను పునఃప్రారంభించాలని ప్రజలు కో రుతున్నారు. మండలంలోని వైబీ హళ్లి, చందక చర్ల, కల్లుమర్రి, ఆర్‌ అనంతపురం, ఆమిదాల గొంది, నీలకంఠాపురం, బుళ్లసముద్రం, మెళవా యి, హరేసముద్రం పంచాయతీ కేంద్రాల్లో ఎన్టీ ఆర్‌ సుజల స్రవంతి ప్లాంట్లను గతంలో ఏర్పా టుచేశారు. వైసీపీ పాలనలో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీలలో నిధు లు లేకపోవడంతో చాలా చోట్ల ప్లాంట్ల పరికరా లను మరమ్మతులు చేయించలేక పోవడంతో ఆ ప్లాంట్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల నామమాత్రంగా నడుస్తున్నాయి. దీంతో పలు గ్రామాల ప్రజలు శుద్ధ తాగునీ టిని పట్టణాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. అక్కడ బిందె నీటిని రూ.10తో కొనుగోలు చేసి ద్విచక్రవా హనాలు, ఆటోల్లో తెచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో డబ్బుతో పాటు సమయం వృథా అవుతోందని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం రా వడంతో గ్రామీణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మూత పడిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి ప్లాంట్లను మళ్లీ ప్రారంభించాలని కోరు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 17 , 2024 | 12:35 AM