Unidentified woman died గుర్తుతెలియని మహిళ మృతి
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:41 AM
రైల్లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని ముస్లిం మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ నాగప్ప తెలిపారు. ఆదివారం రాయచూరు నుంచి గుంతకల్లు మీదుగా కన్యాకుమారికి వెళ్తున్న రైలులో 46 ఏళ్ల వయసు గల ఓ మహిళ అపస్మారకస్థితిలో ఉండగా స్థానిక ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
గుత్తి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రైల్లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని ముస్లిం మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ నాగప్ప తెలిపారు. ఆదివారం రాయచూరు నుంచి గుంతకల్లు మీదుగా కన్యాకుమారికి వెళ్తున్న రైలులో 46 ఏళ్ల వయసు గల ఓ మహిళ అపస్మారకస్థితిలో ఉండగా స్థానిక ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
గుత్తి రైల్వేస్టేషనలో ఆ ఆమెను స్థానిక వైద్యుడు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించాడు. మృతదేహాన్ని రైలులో నుంచి దింపి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మార్చురీకి తరలించారు. ఈమె పింక్ కలర్ పంజాబీ డ్రస్సు, నలుపు రంగు బురకా ధరించిందన్నారు. ఈమెకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈమె ఆచూకీ తెలిసిన వారు వ 6305073235కు సంప్రదించాలరి రైల్వే ఎస్‌ఐ సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..