Share News

జగన చేతగానితనం వల్లే నిరుద్యోగం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:10 AM

పరిపాలన చేతగాని జగన నిర్వాకం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు అన్నారు.

జగన చేతగానితనం వల్లే నిరుద్యోగం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు

మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు

గుంతకల్లు, జనవరి 11: పరిపాలన చేతగాని జగన నిర్వాకం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు అన్నారు. గురువారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం కారణంగా కొత్త కంపెనీలు, ఫ్యాక్టరీలు రావడం లేదన్నారు. దీంతో నిరుద్యోగం తాండవిస్తోందని విమర్శించారు. ఈ కారణంగానే చంద్రబాబు చేపట్టిన రా.. కదలిరా కార్యక్రమానికి అశేష జనవాహిని కదలి వస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి స్థాపన, అభివృద్ధిని సాధించే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్తున్నారని తెలిపారు. జగన మాత్రం ఇచ్చిన హామీలను పక్కనపెట్టి జనాన్ని మద్యంలో ముంచెత్తుతున్నాడని, కల్తీ మద్యాన్ని తాపి పేదల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడని అన్నారు. టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీఎస్‌ కృష్ణారెడ్డి, వాల్మీకి సాధికార సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి మస్తానప్ప, బీసీ సెల్‌ పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు టీ కేశప్ప, నాయకులు రాయల్‌ రామయ్య, రంజాన, ఫజులు, జగన్నాథ్‌ పాల్గొన్నారు.

రా...కదలిరా... సభలతో వైసీపీలో వణుకు

- టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమా

కళ్యాణదుర్గం: టీడీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రా...కదలిరా...సభలకు ప్రజలు నీరాజనం పలుకుతుండడంతో వైసీపీ ప్రభుత్వం లో వణుకు పుట్టిందని నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయు డు అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్‌ భవనలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ యహో బీసీల పేరుతో టీడీపీ పార్టీ ప్రతి పార్లమెంటు, మండల, గ్రామస్థాయిలో ప్రజల్లోకి వెళ్తోందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అన్ని విధాలుగా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గల్లంతు చేయడానికి రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. క్లస్టర్‌ ఇనచార్జ్‌ మాదినేని మురళి, పార్లమెంట్‌ కార్యదర్శి తలారి సత్తి, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి రామరాజు, మండల కన్వీనర్‌ ధనుంజయ, గోవిందు, మల్లి, వెంకటేశులు, ఎరుకుల హరి, వర్లి రాజు, చక్రపాణి, బ్రిజేష్‌, తిమ్మప్ప, లక్ష్మన్న పాల్గొన్నారు.

దళిత, బీసీ, మైనార్టీల ద్రోహి జగన

గుంతకల్లు: దళితులకు, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు జగన తీరని ద్రోహం చేశాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్‌ విమర్శించారు. గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తనది దళిత, బీసీ, మైనార్టీల ప్రభుత్వం అంటూ ఏ అవసరానికి ఆ మాట మాట్లాడిన జగన నాలుగున్నరేళ్ల పరిపాలనలో వారెవరినీ వదలకుండా అందరినీ వంచించాడన్నారు. 25 మంది దళితులు హత్యకు గురయ్యారన్నారు. అగ్రవర్ణ మహిళపై అత్యాచారం జరిగితే ఒకలాగ, దళిత యువతి మానభంగం, హత్యకు లోనైతే ఒకలా ప్రవర్తించి దళితులను వంచించాడన్నారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జరుగుతున్న అన్యాయాన్ని, ద్రోహాన్ని గుర్తించి వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలన్నారు. బొజ్జే నాయక్‌, కే జగదీశ, లక్ష్మీనారాయణ, అశోక్‌, న్యాయవాది సురేశ, మీనా, చాంద్‌బాషా, సంగాల రాము పాల్గొన్నారు.

అభివృద్ధికి అడ్రస్‌.. టీడీపీ: పీజేఆర్‌

పామిడి: అభివృద్ధికి తెలుగుదేశంపార్టీ అడ్రస్సుగా నిలిచిందని టీడీపీ నాయకులు, పీజేఆర్‌ ట్రస్టు చైర్మన పెరుమాళ్ల జీవానందరెడ్డి అన్నారు. మండలంలోని గజరాంపల్లి గ్రామంలోని వ్యాలీ గ్రీన గార్మెంట్స్‌ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభు త్వం టీడీపీ అభివృద్ధి, సంక్షేమ పథకాలనే అనుసరించిందన్నారు. ఆ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందన్నారు. వైసీపీ ప్రభు త్వ సంక్షేమం, అభివృద్ధిలో పూర్తిస్థాయిలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు.

Updated Date - Jan 12 , 2024 | 12:10 AM