Share News

ఘనజీవామృతంపై అవగాహన

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:51 PM

మండలంలోని గేమేనాయక్‌తండా, మార్పురివాండ్లపల్లి, నక్కరాళ్ల తండా గ్రామాల్లో ఘనజీవామృతంపై జనజాగృతి ఆధ్వర్యంలో రైతులకు శుక్రవారం అవగా హన కల్పించారు.

ఘనజీవామృతంపై అవగాహన
గేమేనాయక్‌ తండాలో శిక్షణ ఇస్తున్న సభ్యులు

తనకల్లు, జూలై 5: మండలంలోని గేమేనాయక్‌తండా, మార్పురివాండ్లపల్లి, నక్కరాళ్ల తండా గ్రామాల్లో ఘనజీవామృతంపై జనజాగృతి ఆధ్వర్యంలో రైతులకు శుక్రవారం అవగా హన కల్పించారు. పురుగుమందులు, రసాయన ఎరువులు అధికంగా పంటలకు ఉపయో గించడం వలన కలిగే నష్టాలను, తద్వారా ఏర్పడే అనర్థాలను వలంటర్‌ రమణ నాయక్‌, ప్రకృతి వ్యవసాయ నిపుణురాలు సుప్రియ రైతులకు వివరించారు. ఘన జీవా మృతం తయారీ, నిలువ చేసుకొనే విధానంపై శిక్షణ ఇచ్చారు.


బెల్లం, శనగపిండి, స్థాని కంగా దొరి కే పుట్టమన్ను, ఆవు పేడ, ఆవు మూత్రంతో ఘన జీవామృతం తయారు చేసి చూపించారు. ఘన జీవామృతాన్ని ఉపయోగించడం వలన భూమి సారంవంతం కావడం తో పాటు పంట దిగుబడి పెరుగుతుందని, వ్యవసాయ పెట్టుబడులూ తగ్గుతాయని వివరించారు.

Updated Date - Jul 05 , 2024 | 11:52 PM