ICDS : ఐసీడీఎస్ ఆధ్వర్యంలో... ‘అంగనవాడీ పిలుస్తోంది’
ABN , Publish Date - Jun 15 , 2024 | 11:57 PM
మండలంలోని పుట్టగుండ్లపల్లి అంగనవాడీ కేంద్రంలో శనివారం గ్రాడ్యుయేషన డే, అంగనవాడీ పిలుస్తోంది కార్యక్రమాలను నిర్వహిం చారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో ప్రీస్కూల్ పిల్లల తల్లితండ్రు లతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నా రులను అంగనవాడీకేంద్రంలో చేర్పించాలని ప్రజలను కోరారు.
గోరంట్ల, జూన 15: మండలంలోని పుట్టగుండ్లపల్లి అంగనవాడీ కేంద్రంలో శనివారం గ్రాడ్యుయేషన డే, అంగనవాడీ పిలుస్తోంది కార్యక్రమాలను నిర్వహిం చారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో ప్రీస్కూల్ పిల్లల తల్లితండ్రు లతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నా రులను అంగనవాడీకేంద్రంలో చేర్పించాలని ప్రజలను కోరారు.
ఐదేళ్లు నిండిన అం గనవాడీ పిల్లలకు ప్రత్యేక దుస్తులు వేసి గ్ర్యాడ్యుయేషన డేని ఘనంగా నిర్వహిం చారు. పిల్లలకు ప్రీస్కూల్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వారిని ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్లి ప్రవేశాలు చేయించారు. ఉపాధ్యాయుడు సురేష్, ఎంఎస్‌కే భారతి, వెల్పేర్ అసిస్టెంట్ శ్రావణి, అంగనవాడీ కార్యకర్తలు అరు ణ, లక్ష్మీబాయి, సాలెమ్మ, ఏఎనఎంలు, ఆశా కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులున్నారు.
అగళి: మండలంలోని నర్సంబుది గ్రామంలో శనివారం అంగనవాడీ పిలు స్తోంది కార్యక్రమాన్ని సూపర్‌వైజర్ లీలావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్నారు లతో కలిసి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. మూడేళ్లు నిండిన చిన్నారు లను తప్పకుండా అంగనవాడీ కేంద్రాల్లో చేర్చేలా తల్లిదండ్రులు చొరవ చూపా లన్నారు. అంగనవాడీ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్ర మంలో గ్రామస్థులు, అంగనవాడీ ఆయాలు కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....