Share News

TDP : ఊసరవెల్లి రాజకీయాలు మానుకో ఉమా

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:45 PM

ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని వైసీపీ నాయకుడు ఉమామహేశ్వరనాయుడుకు టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు వైపీ రమేష్‌ సూచించారు. గురువారం స్థానిక ఎన్టీఆర్‌ భవనలో బీజేపీ, జనసేన నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

TDP : ఊసరవెల్లి రాజకీయాలు మానుకో ఉమా
YP Ramesh speaking

ప్రజాస్వామ్యం గురించి రంగయ్య మాట్లాడటం విడ్డూరం

కళ్యాణదుర్గం రూరల్‌, జూన 6: ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని వైసీపీ నాయకుడు ఉమామహేశ్వరనాయుడుకు టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు వైపీ రమేష్‌ సూచించారు. గురువారం స్థానిక ఎన్టీఆర్‌ భవనలో బీజేపీ, జనసేన నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకుడు ఉమామహేశ్వరనాయుడు సానుభూతి కోసమే తన ఇంటిపై మనుషులతోనే దాడి చేయించుకుని అమిలినేని సురేంద్రబాబుపై నెట్టడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. అమిలినేని సురేంద్రబాబుని టీడీపీ అధిష్టానం ప్రకటించినప్పటి నుంచి ఉమా తన అనుచరవర్గంతో అనేక దఫాలుగా దాడులు చేయిస్తే అప్పుడు గుర్తుకురాని ప్రజాస్వామ్యం ఇప్పుడు తలారి రంగయ్యకు మాట్లాడే అర్హత లేదన్నారు. అమిలినేని సురేంద్రబాబు మేనల్లుడు ధర్మతేజపై రాళ్ల దాడి జరిగినప్పుడు, తనయుడు యశ్వంత చౌదరిపై పోలీస్‌ స్టేషన ఆవరణలోనే వైసీపీ మూకలు రాళ్లదాడికి తెగబడినప్పుడు లేవని నోరు ఉమాపై ఆయన మనషులే దాడి చేస్తే అసత్యపు దాడులను ఖండించడానికి మాత్రమే పనికి వస్తుందని ఎద్దేవా చేశారు. సౌమ్యుడైన సురేంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి కళ్యాణదుర్గం వచ్చినప్పుడు టీ సర్కిల్లో నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడారు కానీ టీడీపీ కార్యకర్తలు నాయకులు సామరస్యంగా వుండాలని పిలుపునిచ్చారన్నారు. మండల కన్వీనర్‌ గొల్ల వెంకటేశులు, బీజేపీ జిల్లా కార్యదర్శి సోమశేఖర్‌, జనసేన, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:45 PM