Share News

ఉగాది ప్రత్యేక రైలు

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:31 PM

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రైళ్లలో ప్రయాణికుల రద్దీ నిరయంత్రణ కోసం హుబ్లీ-విజయవాడ-హుబ్లీ మధ్య (వయా గుంతకల్లు, బళ్లారి) ఓ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఉగాది ప్రత్యేక రైలు

గుంతకల్లు, ఏప్రిల్‌ 8: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రైళ్లలో ప్రయాణికుల రద్దీ నిరయంత్రణ కోసం హుబ్లీ-విజయవాడ-హుబ్లీ మధ్య (వయా గుంతకల్లు, బళ్లారి) ఓ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ-హుబ్లీ (నెం.07001) ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేదీన విజయవాడలో మధ్యాహ్నం రెండున్నరకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7-10 గంటలకు హుబ్లీకి చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం.07002) ఈనెల 11వ తేదీన హుబ్లీలో ఉదయం 9-25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 1 గంటకు విజయవాడకు చేరుతుందన్నారు. ఈ రైలు గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొణకొండ, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన, గుంతకల్లు, బళ్లారి, తోరణగల్లు, హోసపేట, మునీరాబాద్‌, కొప్పళ, గదగ్‌, అనిగిరి స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 11:31 PM