Share News

తూతూమంత్రంగా మండల సమావేశం

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:49 PM

సభ్యులు లేక ఖాళీ కుర్చీలతో మండల సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా మంగళవారం ముగిసింది.

తూతూమంత్రంగా మండల సమావేశం
ప్రజాప్రతినిధులు లేక ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

పలువురు స్థానిక ప్రజాప్రతినిధుల డుమ్మా

గోరంట్ల, జనవరి 30: సభ్యులు లేక ఖాళీ కుర్చీలతో మండల సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా మంగళవారం ముగిసింది. ఎంపీపీ ప్రమీల అధ్యక్షతన ఎంపీడీఓ రఘునాథ్‌గుప్త సమావేశాన్ని ఆలస్యంగా ప్రారంభిం చారు. పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త మంత్రి ఉషశ్రీ భర్త చరణ్‌రెడ్డి మంగళవారం పుట్టగుండ్లపల్లి పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. ఆయన బుధవారం కమ్మవారిపల్లి పంచాయతీలో పర్యటించనున్నారు. దీంతో ఆ పర్యటనలో పాల్గొనడానికి కొంతమంది, ఏర్పాట్లుకోసం మరికొంతమంది సభ్యు లు వెళ్లడంతో సమావేశం ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఎంపీటీసీ సభ్యులు ముందుగానే సంతకాలు చేసి వెళ్లడంతో కోరం ఉందని సమావేశం జరిపారు. సర్పంచలు అధిక సంఖ్యలో హాజరుకాలేదు. దీంతో అధికారుల ప్రసంగాలతో ఎలాంటి చర్చలేకుండానే సమావేశం పూర్తి అయింది. మలసముద్రం పంచా యతీ బూదిలివాండ్లపల్లికి చెందిన కొంతమంది సభ్యుల స్థానంలో కూర్చు న్నారు. తాగునీటి సమస్య చర్చకు వచ్చినప్పుడు వారు అధికారులతో వాగ్వా దానికి దిగారు. కొంతమంది పనికట్టుకుని నీటిపథకం మోటార్లకు విద్యుత కనె క్షనను రివర్సులో ఏర్పాటు చేయడం ద్వారా సమస్యలు సృష్టిస్తున్నారని, అయి నా ఎప్పటికపుడు మరమ్మత్తులు చేయిస్తున్నామని టీడీపీ సర్పంచ సువర్ణమ్మ భర్త అశ్వత్థరెడ్డి తెలిపారు. అయితే పంచాయతీలోని ఇతర గ్రామాల్లో లేని సమస్య బూదిలివాండ్లపల్లిలోనే ఎందుకొస్త్తుందని ఏఈ ప్రశ్నించారు. సమావేశానికి ముందే మలసముద్రం పంచాయతీ కార్యదర్శి మస్తానతో కార్యాలయం వద్ద నీటి విషయంపై ఆ గ్రామస్థులు ఘర్షణపడ్డారు. అనంతరం సమావేశంలో ధ్వజమెత్తారు. సభ్యులు తప్ప ఇతరులను సమావేశానికి అనుమతించమని, ఆజెండాలో పేర్కొన్నా.... వారు అధికారపార్టీ మద్దతుదారులు కావడంతో అధికారులు సైతం నోరు మెదపడకపోవడం గమనార్హం.

Updated Date - Jan 30 , 2024 | 11:53 PM