Share News

మందుబాబుల కష్టాలు...!

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:12 AM

ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో రెండు రోజుల నుంచి మళ్లీ మద్యం విక్రయాలకు ఫోనపే ఆంక్షలు పెట్టారు. కేవలం డిజిటల్‌ లావాదేలను అనుమతిస్తుం డటంతో మద్యం ప్రియులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.

మందుబాబుల కష్టాలు...!
కమలానగర్‌లో మద్యం షాపు వద్ద క్యూ

అనంతపురం అర్బన, జూన 2: ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో రెండు రోజుల నుంచి మళ్లీ మద్యం విక్రయాలకు ఫోనపే ఆంక్షలు పెట్టారు. కేవలం డిజిటల్‌ లావాదేలను అనుమతిస్తుం డటంతో మద్యం ప్రియులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. మద్యం దుకాణాల వద్ద ఫోన పే చేసి మద్యం తీసుకువెళ్లే వారిని బతిమలాడి వారికి నగదు అందజేసి వారితో ఫోన పే ద్వారా డబ్బులు వేయుంచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోతోంది. దీంతో చేసిందేమి లేక నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితిని అనేక మంది మద్యం ప్రియులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం జే బ్రాండ్లును మాత్రమే అందుబాటులో ఉంచారు. మిగతా బ్రాండ్లను కొందరు షాపుల్లో పనిచేసే సిబ్బంది తమకు తెలిసిన వారికి, రాజకీయ నాయకులకు గుట్టుచప్పుడు కాకుండా అందజేసినట్లు సమాచా రం. ఇదిలా ఉండగా... వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం షాపుల్లో కేవలం నగ దు లావాదేవీలు జరిపారు. సాధారణ టీకొట్టు, తోపు డు బండ్లల్లోనూ ఫోన పే అవకాశం ఉండగా ప్రభు త్వ మద్యం దుకాణాల్లో ఎందుకు డిజిటల్‌ లావాదేవీలు జరపలేదని ప్రతిపక్షాలు అనేక సార్లు గొంతెత్తినా పట్టించుకోలేదు. తీరా పోలింగ్‌కు ఐదు రోజుల ముందు కేవలం ఫోనపే ద్వారానే డబ్బులు చెల్లించాలని షరతు పెట్టారు. పోలింగ్‌ అనంతరం తిరిగి నగదును అనుమతించారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో రెండు రోజులుగా కేవలం ఫోనపే ఆంక్షలు అమలు చేయడంపై మద్యం ప్రియులు మండిపడుతున్నారు. ఫోనపేతో పాటు నగదు లావాదేవీలకు ఎందుకు అనుతించ కూడదని నిలదీస్తున్నారు. ఐదేళ్లు డిజిటల్‌ లావాదే వీలు చేయకుండా ఎన్నికల సమయంలో ఈ గోలేంటని నిట్టూరుస్తున్నారు.


క్యూకట్టిన మద్యం ప్రియులు : ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో తాడిపత్రి నియోజకవర్గంలో సోమ, మంగళ, బుధవారాల్లో ప్రభుత్వ మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను బంద్‌ చేయనుంది. తాడిపత్రి నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు అల్లర్లను దృష్టిలో ఉంచుకొని మద్యం షాపులు బంద్‌ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి వినోద్‌కుమార్‌ నిర్ణయించారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఈనెల 3వతేదీ సాయంత్రం 5 గంటల నుంచి 4వతేదీ దాకా మద్యం షాపులు బంద్‌ చేస్తారు. కౌంటింగ్‌ను దృష్టిలో ఉంచుకొని మద్యం షాపులు బంద్‌ చేస్తు న్నారన్న సమాచారంతో మద్యం ప్రియులు ముంద స్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మద్యం షాపుల వద్ద మద్యం ప్రియులు క్యూ కట్టారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కేవలం ఫోన పే ద్వారానే డబ్బులు స్వీకరిస్తామని, నగదు తీసుకోమని చెప్పడంతో ఇదెక్కడి అన్యాయమంటూ సిబ్బందితో మద్యం ప్రియులు వాగ్వాదానికి దిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో కొందరు తమకు తెలిసిన వారితో ఫోన పే ద్వారా డబ్బులు చెల్లించి మద్యం కొనుగోలు చేసుకున్నారు. మరికొందరు నిరాశతో వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది.

Updated Date - Jun 03 , 2024 | 12:12 AM