Share News

ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Jun 19 , 2024 | 11:32 PM

ఆర్డీటీ సంస్థ ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ 15వ వర్థింతిని పురష్కరించుకొని స్థానిక కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, తదితరులు పూల మాలలు వేసి బుధవారం ఘనంగా నివాళుల ర్పించారు.

ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌కు ఘన నివాళి
ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం అర్బన, జూన 19 : ఆర్డీటీ సంస్థ ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ 15వ వర్థింతిని పురష్కరించుకొని స్థానిక కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, తదితరులు పూల మాలలు వేసి బుధవారం ఘనంగా నివాళుల ర్పించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఫాదర్‌ ఫెర్రర్‌కు అనంత జిల్లా ఎల్లప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కరువు జిల్లాలో పేదల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు బుగ్గయ్య చౌదరి, కూచి హరి, లింగారెడ్డి, నెట్టెం బాలకృష్ణ, చేపల హరి, సురేష్‌ చౌదరి, వెంకటేశ్వరరెడ్డి, ఓంకార్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2024 | 11:32 PM