Share News

దామోదరం సంజీవయ్యకు ఘన నివాళి

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:41 AM

పుట్టపర్తి, ఫిబ్రవరి 14 : ఆంధ్ర ప్రదేశ తొలి దళిత ముఖ్యమంత్రిగా పని చేసిన దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు.

దామోదరం సంజీవయ్యకు ఘన నివాళి

పుట్టపర్తి, ఫిబ్రవరి 14 : ఆంధ్ర ప్రదేశ తొలి దళిత ముఖ్యమంత్రిగా పని చేసిన దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవయ్య చిత్రపటానికి కలెక్టర్‌ అరుణ్‌బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సాధారణ దళిత కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవయ్య కష్టపడి చదివి కలెక్టర్‌ స్థాయికి ఎదిగారన్నారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ రెండో ముఖ్యమంత్రిగా సేవలందించారన్నారు. రాష్ర్టానికి తొలి దళిత ముఖ్యమంత్రి ఆయనేనని పేర్కొన్నారు. వృద్ధాప్య పింఛన పథకం రూపకర్త దామోదరం సంజీవయ్యనేనని కొనియాడారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కొండయ్య, సాంఘిక సంక్షేమశాఖాధికారి శివరంగప్రసాద్‌, ఎస్సీ విజిలెన్స కమిటీ సభ్యుడు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:41 AM