Share News

Tribute to Abdul Kalam అబ్దుల్‌ కలామ్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:23 AM

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ వర్థంతిని పట్టణంలో టీడీపీ శ్రేణులు శనివారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా స్థానిక 60అడుగుల రోడ్డులో గల కలాం విగ్రహానికి ఎమ్మెల్యే గు మ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి పూలమా ల వేసి నివాళులర్పించారు.

Tribute to Abdul Kalam అబ్దుల్‌ కలామ్‌కు ఘన నివాళి
గుంతకల్లులో కలామ్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

గుంతకల్లుటౌన,జూలై27: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ వర్థంతిని పట్టణంలో టీడీపీ శ్రేణులు శనివారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా స్థానిక 60అడుగుల రోడ్డులో గల కలాం విగ్రహానికి ఎమ్మెల్యే గు మ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి పూలమా ల వేసి నివాళులర్పించారు.


అనంతరం మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం శా స్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి చేసిని సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌, నాయకులు గుజిరీ మహ్మద్‌ఖాజా, ఫ్రూట్‌మస్తాన, ఫజులు, ఆటోఖాజా తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు కూడా కలామ్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వడ్డె రమేష్‌, అసెంబ్లీ కన్వీనర్‌ బండారుకృష్ణమూర్తి, పట్టణ ప్రధాన కార్యదర్శి సతీష్‌, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాఽధ్యక్షురాలు విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థిసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్దుల్‌బాసిద్‌, అధ్యక్షుడు మహేష్‌గుప్తా, తదితర నాయకులు కూడా నివాళులర్పించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 28 , 2024 | 12:23 AM