Share News

ROAD : రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు

ABN , Publish Date - May 19 , 2024 | 12:11 AM

మండలంలోని వట్టేబెట్ట అటవీప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు అడ్డంగా ఏపుగా పెరిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారుటు ఎదు రుగా వచ్చే వాహనాలను గుర్తించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. మలుపుల వద్ద మరింత ప్రమాదకరంగా ఉం దని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్న అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ROAD : రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు

ఇబ్బందిపడుతున్న వాహనదారులు

గుడిబండ, మే 18 : మండలంలోని వట్టేబెట్ట అటవీప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు అడ్డంగా ఏపుగా పెరిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారుటు ఎదు రుగా వచ్చే వాహనాలను గుర్తించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. మలుపుల వద్ద మరింత ప్రమాదకరంగా ఉం దని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్న అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చొర వ తీసుకుని రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లను తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - May 19 , 2024 | 12:11 AM