CPR : సీపీఆర్‌పై వైద్య సిబ్బందికి శిక్షణ
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:32 AM
గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ అత్యవసర చికిత్సగా మారడంతో జిల్లా ఆస్పత్రిలో శనివారం డాక్టర్లు, వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

అనంతపురం టౌన, జూలై 27: గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ అత్యవసర చికిత్సగా మారడంతో జిల్లా ఆస్పత్రిలో శనివారం డాక్టర్లు, వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారు. డాక్టర్ నబీనకుమార్, డాక్టర్ నూరుల్లాఖాన గుండెపోటు వచ్చినపుడు సీపీఆర్ చేస్తే బాధితుల ప్రాణాలు కాపాడవచ్చని, ఆసీపీఆర్‌ను ఎలాచేయాలి అనేదానిపై ప్రాక్టికల్‌గా చూపిస్తూ అవగాహన కల్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో గుండెపోటు కేసులు పెరిగిపోయాయన్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో సీపీఆర్ చేస్తే బాధితులు అధిక శాతం బతికే అవకాశాలు ఉంటాయన్నారు. అందుకే ప్రజలు, వైద్యనిపుణులు ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవాలని సూచించారు. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రతి డాక్టర్, నర్సులు, సిబ్బంది సీపీఆర్ ఎలా చేయాలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆర్‌ఎంఓలు డాక్టర్ పద్మజ, డాక్టర్ హేమలత, డాక్టర్ సునీత పాల్గొన్నారు.