Share News

టీడీపీ బూత కమిటీ కన్వీనర్లకు శిక్షణ

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:25 AM

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం వందశాతం పూర్తిచేయాలని టీడీపీ శిక్షకుడు మనోహర్‌ నాయుడు అన్నారు.

టీడీపీ బూత కమిటీ కన్వీనర్లకు శిక్షణ
పురంలో శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మనోహర్‌నాయుడు

హిందూపురం, జనవరి 27 : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం వందశాతం పూర్తిచేయాలని టీడీపీ శిక్షకుడు మనోహర్‌ నాయుడు అన్నారు. టీడీపీ పరిగిలో మండల కన్వీనర్‌ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో శనివారం బూత కన్వీనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌నాయుడు మాట్లా డుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం వందశాతం పూర్తి చేస్తే ప్రతి ఇంటికి టీడీపీ మ్యానిఫెస్టో వెళ్లినట్లన్నారు. ఈ విషయంలో బూత కన్వీనర్లు సైనికుల్లా పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఓటరు వెరిఫికేషన విష యంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మృతిచెందినవారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండటం, డబుల్‌ ఎంట్రీ లపై దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నరసింహులు, మాజీ సర్పంచ ఈశ్వరప్ప, కుమార్‌, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ, ఆనంద్‌, బాలు తదితరులు పాల్గొన్నారు.

గోరంట్ల: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మండలంలోని బూత కన్వీన ర్లకు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఐటీడీపీ కి చెందిన హిందూపురం పార్లమెంటు ఇనచార్జ్‌లు రామాంజనేయులు, పరిమళ, ఎన్పీకుంట గంగశేఖర్‌ పలు విషయాలపై వివరించారు. ఓటర్లు జాబితా పరిశీలన, బాబుషుర్యూటీ భవిష్యత గ్యారెంటీ కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో టీడీపీ కన్వీనర్‌ సోముశేఖర్‌, ప్రధాన కార్యదర్శి అశ్వత్థరెడ్డి, వేణుగోపాల్‌, ఉమ్మర్‌ఖాన, తిరుపాల్‌,మనోహర్‌; కాలనీ శ్రీనివాసులు, మల్లికార్జు న తదితరులు, మండలంలోని 75మంది బూత కన్వీనర్లు పాల్గొన్నారు.

రొద్దం : మండలంలోని టీడీపీ బూత ఇనచార్జ్‌లకు శనివారం ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండల పరిధిలోని ఆర్‌ మరువపల్లిలో ఉన్న బీకే స్వగృహంలో ఇంటిగ్రేటెడ్‌ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్‌-1, 2, యూనిట్‌ ఇనచార్జ్‌లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మడకశిర నుంచి వచ్చిన ట్రైనర్‌ నవీన పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో రాబోయే ఎన్నికలకు సన్నద్దులయ్యేలా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు చిన్నప్పయ్య, బీకే సాయికళ్యాణ్‌, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నరసింహులు, తెలుగు యువత నాయకులు హరీష్‌, నరహరి, ఎం కొత్తపల్లి మాజీ సర్పంచ నారాయణ, తురకలాపట్నం హరిక్రిష్ణ, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:25 AM