Share News

పట్టాల పంపిణీలోనూ తోపు రాజకీయం..!

ABN , Publish Date - May 08 , 2024 | 11:48 PM

అర్హతే ప్రామాణికం..అర్హులందరికీ సంక్షేమ ఫథకాలు ఇస్తాం అంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిత్యం జనం ముందు చెప్పే మాటలు. వారి మాటలకు చేతలకు పొంతన ఉండదని జనం నుంచి వినిపిస్తున్న మాట. రూరల్‌ మండలం కొడిమి పంచాయతీలో ఇళ్ల పట్టాల పంపిణీ ఇందుకు నిదర్శనమని గ్రామస్థులు అంటున్నారు.

పట్టాల పంపిణీలోనూ తోపు రాజకీయం..!

అనంతపురంరూరల్‌, మే 8: అర్హతే ప్రామాణికం..అర్హులందరికీ సంక్షేమ ఫథకాలు ఇస్తాం అంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిత్యం జనం ముందు చెప్పే మాటలు. వారి మాటలకు చేతలకు పొంతన ఉండదని జనం నుంచి వినిపిస్తున్న మాట. రూరల్‌ మండలం కొడిమి పంచాయతీలో ఇళ్ల పట్టాల పంపిణీ ఇందుకు నిదర్శనమని గ్రామస్థులు అంటున్నారు. కొడిమి పట్టాల పంపిణీలో వైసీపీ సానుభూతి పరులకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కడైన తమ పార్టీ వారైతే..ఒకటి రెండు ఎక్కువ ఇచ్చే సందర్భాలుంటాయి. ఇక్కడ మాత్రం దాదాపు వైసీపీ సానుభూతి పరులే ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో అధికార పార్టీకి చెందిన వారేనా అర్హులు.. మరెవరూ లేరా అని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇదేనేమో..తోపుదుర్తి వారి రాజకీయమంటే అని పెదవి విరుస్తున్నారు.

పట్టాలన్నీ వైసీపీ వారికే..

మండలంలోని నరసనాయనికుంట, కొడిమి, పాపంపేట పరిధిలోని వారికి కొడిమి గ్రామ సమీపంలోని సర్వే నెంబరు 149,136లో పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో పాపంపేట పరిధిలోని 266 మందికి, నరసనాయనికుంట 38 మందికి, కొడిమిగ్రామ పరిధిలో 80 మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. కొడిమి గ్రామంలో ఇళ్ల పట్టాలు పొందిన వారిలో వైసీపీ సానుభూతి పరులే అధికంగా ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. 80మందిలో దాదాపు వైసీపీ వారే ఉన్నట్లు చెబుతున్నారు. గ్రామంలో పదుల సంఖ్యలో పేదలు ఉన్నా.. వారందరినీ పక్కన బెట్టి వైసీపీ నాయకులు చెప్పిన..ఆ పార్టీ వారికే ఎక్కువగా ఇచ్చినట్లు గ్రామంలో చర్చంచుకుంటున్నారు. గ్రామ సమీపంలో ఇళ్ల పట్టాలు పొందిన వారికి ఇంత వరకు స్థలాలు చూపలేదంటున్నారు. పేరుకు మాత్రమే పట్టాలు పంపిణీ చేసి..స్థలాలు చూపించలేదంటున్నారు. సాధారణంగా ఇళ్ల స్థలాలను సిద్ధం చేసి లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంటుంది. ఇక్కడ అదేమీ లేకుండానే పట్టాలు పంపిణీ చేశారు.

వైసీపీని ఇంటికి పంపే సమయమొచ్చింది

అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ బొమ్మనహాళ్‌, మే 8: ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు.. ఇలా అన్ని రంగాల వారు ఇబ్బందులకు గురయ్యారని, ఆ పార్టీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని అనంతపురం లోక్‌సభ కూటమి అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గోవిందవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు, బీజేపీ ఇనచార్జ్‌ వసుంధరదేవి, జనసేన ఇనచార్జ్‌ మంజునాథ్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబికా మాట్లాడుతూ వైసీపీ మాయమాటలతో ఒక్క అవకాశం ఇచ్చి అన్ని రంగాల వారు తమ జీవితాలను నాశనం చేసుకున్నారని తెలిపారు. రైతులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావాలని, నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావాలని అన్నారు. ఈ ఐదేళ్ల అరాచకపాలనలో ప్రజలు నలిగిపోయారని, ఏ వర్గం వారు సంతోషంగా లేరని చెప్పారు. జగన ముఖ్యమంత్రి అయిన తరువాత మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామని చెప్పి నాసిరకం మద్యాన్ని అమ్మించి ప్రజల జీవితాలతో చెలగాటమాడారని అన్నారు. ఎనడీఏ కూటమి మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాలు బాగుపడతాయన్నారు. గోవిందవాడ గ్రామంలో ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

Updated Date - May 08 , 2024 | 11:48 PM