Share News

రేపు వాసవీమాత జయంతి

ABN , Publish Date - May 16 , 2024 | 11:22 PM

వాసవీ జయంతిని పురస్కరిం చుకుని శనివారం పాతూరు అమ్మవారి శాలలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నా మని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వాసవీ భజనమండలి గౌరవాధ్యక్షుడు పార్శం సత్యనారాయణ కోరారు.

రేపు వాసవీమాత జయంతి
నగర సంకీర్తన నిర్వహిస్తున్న వాసవీ మాత భజన మండలి సభ్యులు

అనంతపురం కల్చరల్‌, మే 16: వాసవీ జయంతిని పురస్కరిం చుకుని శనివారం పాతూరు అమ్మవారి శాలలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నా మని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వాసవీ భజనమండలి గౌరవాధ్యక్షుడు పార్శం సత్యనారాయణ కోరారు. వాసవీ జయంతి నేపథ్యంలో మంగళవారం నుంచి నిర్వహిస్తున్న నగర సంకీర్తన మూడో రోజున గురువారమూ కొనసాగింది. వాసవీమాత చిత్రపటంతో పురవీధుల్లో తిరుగుతూ, అమ్మవారి భక్తిగీతాలాపనలు చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గర్జాల నాగరాజు, భజనమండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:22 PM