Share News

నేడు కాంగ్రెస్‌ న్యాయ సాధన శంఖారావం

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:28 PM

జిల్లా కేంద్రంలోని కొత్తూరు జూనియర్‌ కళాశాల మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ న్యాయసాధన శం ఖారావం సభను సోమవారం నిర్వహించనుంది.

నేడు కాంగ్రెస్‌ న్యాయ సాధన శంఖారావం

సభఫ హాజరుకానున్న ఏఐసీసీ, పీసీసీ చీఫ్‌లు ఫ సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం..అనంతపురం న్యూటౌన, ఫిబ్రవరి 25: జిల్లా కేంద్రంలోని కొత్తూరు జూనియర్‌ కళాశాల మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ న్యాయసాధన శం ఖారావం సభను సోమవారం నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పార్టీ ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున జన సమీకరణ చేసి సభ విజయవంతం చేయడానికి స్థానిక నాయకులు ఎవరి పరిధిలో వారు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ కోసం పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌, గిడుగు రుద్రరాజుతో పాటు జంగా గౌతమ్‌ ప్రయత్నిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, రాష్ట్రమైనార్టీ విభాగం అ ధ్యక్షుడు దాదాగాంధీ, ఎస్సీ సెల్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌తో పాటు ఎనఎస్‌యూఐ నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణకు చర్యలు చే పట్టారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర విభజనతో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ అస్తిత్వం కోసం తీవ్ర ప్ర యత్నం చేస్తోంది. ఈక్రమంలోనే జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పూరించనున్నారు. ఈ సభతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 ఎన్నికల సభలు నిర్వహించేలా నాయకులు శ్రీకారం చుట్టారు. ఈ సభలకు పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ర్టాల నుంచి ముఖ్య మంత్రులను, ఇతర నాయకులను పిలిపించి స్థానిక నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపే చర్యలకు పూనుకున్నారు. అనంతపురం సభ సక్సెస్‌పైనే ఇతర సభల నిర్వహణ ఆధారపడే అవకాశం ఉందన్న చర్చలు సాగుతున్నాయి.

Updated Date - Feb 25 , 2024 | 11:28 PM