Share News

SAVITA : అభివృద్ధికి పట్టం

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:48 PM

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించి తిరిగి టీడీపీకి ప్రజలు పట్టం కట్టారు. నాడు తండ్రి ఎస్‌ రామచం ద్రారెడ్డి, నేడు ఆయన కుమార్తె సవిత ఎమ్మె ల్యేలుగా గెలిచారు. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి సవిత పలు సేవా కార్యక్ర మాలు చేస్తూ ప్రజల మధ్యనే తిరుగుతూ టీడీపీ కార్యక్రమాల్లో దూసుకుపో యారు. టీడీపీ అధినేత గుర్తించి సవితకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్య ర్థిగా టికెట్‌ ఇచ్చారు. అప్పటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఆమె నాయకులు, కార్యకర్తలను కలుపుకుని వెళ్లి ప్రచారంలో దూసుకెళ్లారు.

SAVITA : అభివృద్ధికి పట్టం
Savitha and husband Venkateshwar Rao showing the declaration form

నాడు తండ్రి నేడు కూతురి విజయం

పెనుకొండ టౌన, జూన 4 : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించి తిరిగి టీడీపీకి ప్రజలు పట్టం కట్టారు. నాడు తండ్రి ఎస్‌ రామచం ద్రారెడ్డి, నేడు ఆయన కుమార్తె సవిత ఎమ్మె ల్యేలుగా గెలిచారు. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి సవిత పలు సేవా కార్యక్ర మాలు చేస్తూ ప్రజల మధ్యనే తిరుగుతూ టీడీపీ కార్యక్రమాల్లో దూసుకుపో యారు. టీడీపీ అధినేత గుర్తించి సవితకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్య ర్థిగా టికెట్‌ ఇచ్చారు. అప్పటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఆమె నాయకులు, కార్యకర్తలను కలుపుకుని వెళ్లి ప్రచారంలో దూసుకెళ్లారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీ చరణ్‌ను దీటుగా ఎదుర్కొని కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటాన ని ఆమె ముందడుగువేశారు.


నియోజకవర్గ వ్యాప్తంగా ఆమెకు ప్రచారంలో బ్రహ్మరథం పట్టారు. ఇదే తరహాలోనే ఆమెకు ఓటు వేసి భారీ మెజార్టీని అందిం చారు.ఈ భారీ మెజార్టీతో పెనుకొండలో వైసీపీ పాతాళంలోకి వెళ్లింది. పెనుకొండ నియోజకవర్గంలో 2,05,048 మంది ఓటు హక్కు వినియోగించుకోగా టీడీపీ అ భ్యర్థి సవితకు 1,11,960, వైసీపీ అభ్యర్థి ఉషాశ్రీకి 79,795 ఓట్లు పడ్డాయి. పోస్టల్‌ బ్యాలెట్‌లో 2,519ఓట్లకు గాను సవితకు 1872, ఉషాశ్రీకి 649 ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి సవితకు మొత్తం మెజార్టీ 33,388 ఓట్టు వచ్చాయి. నోటాకు 1956ఓట్లు పడ్డాయి. బీఎస్పీ తరుపున ఆదినారాయణకు 6193, కాంగ్రెస్‌ అభ్యర్థి నరసింహప్పకు 3,988, జైభీమ్‌ భారత అభ్యర్థి నాగరాజు 411, స్వతంత్ర అభ్యర్థులు ఎ నరసింహులుకు 135, మహేష్‌ 188, సుగాలి గణేష్‌ నాయక్‌ 171, హబీబ్‌ 251చొప్పున ఓట్లు పడ్డాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 04 , 2024 | 11:48 PM