road accident రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:24 AM
మండల కేంద్రం సమీపంలోని వేల్పుమడుగుకు వెళ్లే రోడ్డులో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలవగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

బత్తలపలి,్ల జూన 6: మండల కేంద్రం సమీపంలోని వేల్పుమడుగుకు వెళ్లే రోడ్డులో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలవగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
గంటాపురానికి చెందిన జయసింహ తన కుమారుడు మోక్షితతో కలిసి ద్విచక్ర వాహనంలో బత్తలపల్లికి వస్తున్నాడు. అయితే వేల్పుమడుగు రోడ్డులోకి రాగానే ఎదురుగా ఆటో వేగంగా వచ్చి అదుపుతప్పి ఢీకొంది. ప్రమాదంలో జయసింహకు, మోక్షితకు తీవ్ర గాయాలవగా.. అనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ నాగేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే స్థానిక ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. జయసింహ మోక్షిత పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం వార్తల కోసం...