Share News

కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:29 AM

కదిరి, జనవరి 13: కర్ణాటకనుంచి అక్రమం మద్యం తరలిస్తూ, అలాగే అక్రమ ఆయుధాలు కలిగిన ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

కదిరి, జనవరి 13: కర్ణాటకనుంచి అక్రమం మద్యం తరలిస్తూ, అలాగే అక్రమ ఆయుధాలు కలిగిన ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. పట్టణ పోలీస్‌ స్టేషనలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కదిరి పట్టణానికి చెందిన షేక్‌ ఖాజావలీ, షేక్‌ వలీబాషా, పఠాన ముజాయిద్దీన అలియాజ్‌ ముజు గతంలో పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారన్నారు. పోలీసులు నిఘా ఉంచడంతో కొద్దిరోజులుగా ప రారీలో ఉన్నారని తెలిపారు. అయితే మదనపల్లిరోడ్డు ప్రెటోల్‌ బంక్‌ వద్ద వాహనాల తనిఖీలో వీరు మద్యంను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. వీరు నానా దర్గావద్ద బైక్‌లో అక్రమంగా కర్ణాటక మద్యం తీసుకొస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని, కాగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని సోదాలు చేశారని చెప్పారు. ఇందులో వారి నుంచి 288 టెట్రా ప్యాకెట్లు, 90 ఎంఎల్‌ బాటిళ్లు, రూ. రెండు లక్షల వెయ్యి నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరి మద్యం తరలించే సమయంలో మార్గంమధ ్యలో ఎవరైనా బెదిరించినా, ప్రశ్నించినా చంపడానికి కత్తి, గొడ్డలి, కొడవలిని వెంట బెట్టుకుని తిరుగుతున్నారని, వాటిని కూడా స్వాఽధీనం చేసుకుని అరెస్టు చేశామని అన్నారు. తర్వాత మెజిసే్ట్రట్‌ ఎదుట హాజరు పరచి సబ్‌జైలుకు తరలించామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బాబ్‌జాన, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 12:29 AM