Share News

ఇది ఆర్టీసీ పరీక్ష ..!

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:56 PM

టెన్త పరీక్షలు బుధవా రంతో ముగిశాయి. సొంతూరిలో సరదాగా గడపడం ఎపుడె ప్పుడా అని ఎదురుచూసిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధుమిత్రులతో బస్టాండ్‌ చేరుకున్నారు.

ఇది ఆర్టీసీ పరీక్ష ..!
సీఎం సభకు బస్సులు తరలించడంతో.. బస్సుల్లేక బస్టాండులో ప్రయాణికుల పడిగాపులు

అనంతపురం కల్చరల్‌, మార్చి 27: టెన్త పరీక్షలు బుధవా రంతో ముగిశాయి. సొంతూరిలో సరదాగా గడపడం ఎపుడె ప్పుడా అని ఎదురుచూసిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధుమిత్రులతో బస్టాండ్‌ చేరుకున్నారు. దీంతో స్థానిక ఆర్టీ సీ బస్టాండ్‌ కిటకిటలాడింది. విద్యార్థులు, ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ నేప థ్యంలో బస్సులు తక్కువగా ఉండడంతో నిరీక్షణ తప్పలే దు. ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులు సీట్ల కోసం పాట్లు పడు తూ సొంతూరు వెళ్లారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

సీఎం సేవలో ఆర్టీసీ అధికారులు...

అనంత ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సేవలో తరించిపోతున్నారు. అనంతపురం రీజియన వ్యాప్తం గా మొత్తం 494 బస్సు సర్వీసులున్నాయి. బుధవారం ప్రొద్దు టూరులో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సభ నేప థ్యంలో రీజియన వ్యాప్తంగా దాదాపు సగం ఆర్టీసీ బస్సులను ఆ సభకు కేటాయించి స్వామిభక్తిని చాటుకున్నారు. జిల్లాలో అనంతపురం డిపో నుంచి 32, గుంతకల్లు డిపో 26, ఉరవకొండ డిపో 23, గుత్తి డిపో 10, రాయదుర్గం డిపో 32, తాడిపత్రి డిపో 35, కళ్యాణదుర్గం డిపో నుంచి 32 బస్సులు చొప్పున మొత్తం 190 బస్సులను సీఎం సభకు జనాన్ని తరలించేందుకు కేటాయించారు. అసలే పదోతరగతి పరీక్షలు ముగియడంతో బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయినా ప్రయాణికుల సౌకర్యాన్ని గాలికొదిలేసిన ఆర్టీసీ అధికారులు... సీఎం కార్యక్రమానికి బస్సులను తరలించడంపై ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బస్సుల తరలింపులో ఆర్టీసీ అధికారులు మరో అడుగు ముందుకు వేసి, బుధవారం సీఎం కార్యక్రమానికి తరలించిన ఆర్టీసీ బస్సులు ప్రొద్దుటూరులో మూడు రోజులు, తర్వాత వెంటనే నంద్యాలలో మరో రెండు రోజులు జనాన్ని తరలించేలా డ్రైవర్లకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మొత్తంగా వరుసగా ఐదురోజుల పాటు రీజియన వ్యాప్తంగా ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు.

Updated Date - Mar 27 , 2024 | 11:56 PM