Share News

ఎవరు కావాలో ఆలోచించండి..!

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:08 PM

మాదిగలకు హక్కుగా అందాల్సిన సంక్షేమ పథకాలను రద్దుచేసిన సీఎం జగన, ఐదేళ్ల నుంచి ఆ వర్గ ప్రజలను రోడ్డున పడేశారని మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి నాయకులు మండిపడ్డారు.

ఎవరు కావాలో ఆలోచించండి..!
meeting of madhiga union

మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి

అనంతపురం సెంట్రల్‌, ఏప్రిల్‌ 25: మాదిగలకు హక్కుగా అందాల్సిన సంక్షేమ పథకాలను రద్దుచేసిన సీఎం జగన, ఐదేళ్ల నుంచి ఆ వర్గ ప్రజలను రోడ్డున పడేశారని మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి నాయకులు మండిపడ్డారు. భవిష్యత్తులో జగన కావాలో సంక్షేమాన్ని అందించిన చంద్రబాబు కావాలో విజ్ఞతగా ఆలోచించాలని మాదిగలకు సూచించారు. ఎమ్మార్పీఎస్‌ రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి అక్కులప్ప అధ్యక్షతన పెన్షర్ల భవనలో మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌జే ప్రకాష్‌, ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు, జైమాదిగ సేవా సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు బెంజిమన, మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్‌, నవ్య చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, బేడ, బుడగ జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలతో మాదిగలపై దౌర్జన్యకాండ సాగిందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేసి సంక్షేమ పథకాలను అమలుచేసే నారా చంద్రబాబునాయుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్గీకరణ హామీ పత్రాలను ఆవిష్కరించారు.

Updated Date - Apr 25 , 2024 | 11:08 PM