Share News

విత్తన వేరుశనగ నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు

ABN , Publish Date - May 26 , 2024 | 12:01 AM

విత్తన వేరుశనగ నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని అనంతపురం ఏడీఏ రవి అన్నారు. నాసులు.. పుచ్చులు శీర్షికన నాసిరకం విత్తన వేరుశనగ సరఫరాపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.

విత్తన వేరుశనగ నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు
CALCULATING SELLING RATIO BY AD

నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స రద్దు చేస్తాం అనంతపురం ఏడీఏ రవి

అనంతపురం అర్బన మే 25: విత్తన వేరుశనగ నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని అనంతపురం ఏడీఏ రవి అన్నారు. నాసులు.. పుచ్చులు శీర్షికన నాసిరకం విత్తన వేరుశనగ సరఫరాపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ ఆదేశాల మేరకు శనివారం స్థానిక జస్వంత సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో అనంతపురం ఏడీఏ తనిఖీలు చేశారు. మొలక, సెల్లింగ్‌ శాతాన్ని పరిశీలించారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ నుం చి ఆర్బీకేలకు నాణ్యమైన విత్తన వేరుశనగ సరఫరా చేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి నాసిరకం విత్తన కాయలు పంపిస్తే, వారిని ఉపేక్షించేది లేదని, ఆయా ప్రాసెసింగ్‌ యూనిట్ల లైసెన్సను రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం రూరల్‌ మండలం ఇటుకలపల్లి, ఉప్పరపల్లి రైతు భరోసా కేంద్రాల్లో విత్తన పంపిణీ తీరును పరిశీలించారు. అక్కడి రైతులతో పలు అంశాలపై చర్చించారు. నాణ్యమైన విత్తన కాయలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని, ఎక్కడైనా నాసిరకం విత్తన కాయలు బయటపడితే అధికారుల దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:01 AM