Theft గంగమ్మ ఆలయంలో చోరీ
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:34 PM
మండలకేంద్రానికి సమీపంలో ఉన్న కొత్తబావి గంగమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి చోరి జరిగినట్లు ఆలయ నిర్వాహకుడు పొరకలనాగరాజు బుధవారం తెలిపారు.

నల్లమాడ, జూన 12: మండలకేంద్రానికి సమీపంలో ఉన్న కొత్తబావి గంగమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి చోరి జరిగినట్లు ఆలయ నిర్వాహకుడు పొరకలనాగరాజు బుధవారం తెలిపారు.
మంగళవారం రాత్రి ఆలయ గ్రిల్‌కు రెండుతాళాలు వేశామని, కాగా దుండగులు కింద ఉన్న తాళాన్ని పగులకొట్టి గ్రిల్‌ను వెడల్పు చేసి లోపలికి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే గంగమ్మ ఆలయం సమీపంలో ఉన్న రైతు మహమ్మద్ రఫీక్‌ఖాన మామిడి తోట షెడ్‌కు తాళాలు పగలకొట్టి బోరు మోటారు, స్టార్టర్, పంపు చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...