Share News

బాబుతోనే అన్నివర్గాల సంక్షేమం

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:01 AM

చంద్రబాబుతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని, కావున టీడీపీని గెలిపించి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

బాబుతోనే అన్నివర్గాల సంక్షేమం
గొళ్లపల్లిలో టీడీపీ నాయకుల ప్రచారం

రాప్తాడు, ఫిబ్రవరి 28: చంద్రబాబుతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని, కావున టీడీపీని గెలిపించి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం మండలంలోని గొళ్లపల్లి, పెసరకుంట గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిం చారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు టీడీపీ నాయకులు వద్ద వాపోయారు. కార్యక్రమంలో కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నారాయణస్వామి, సాకే జయరాముడు, చిరంజీవి, కొత్తపల్లి నారాయణస్వామి, రాదాకృష్ణ, చంద్రశేఖర్‌, భాస్కర్‌, నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:01 AM