Share News

జేఈఈ అడ్వాన్సడ్‌లో అనంత విద్యార్థుల ప్రతిభ

ABN , Publish Date - Jun 09 , 2024 | 10:19 PM

ఇండియాలోని ప్రముఖ ఐఐటీలు, ఎనఐటీ సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స పరీక్షల్లో అనంతపురం జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆదివారం విడుదలైన జేఈఈ అడ్వాన్స ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. విద్యార్థుల కుటుంబాల్లో, కళాశాలల్లో సంబరాలు జరుపుకున్నారు.

జేఈఈ అడ్వాన్సడ్‌లో అనంత విద్యార్థుల ప్రతిభ
congratulations to students

అనంతపురం విద్య, జూన 9: ఇండియాలోని ప్రముఖ ఐఐటీలు, ఎనఐటీ సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స పరీక్షల్లో అనంతపురం జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆదివారం విడుదలైన జేఈఈ అడ్వాన్స ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. విద్యార్థుల కుటుంబాల్లో, కళాశాలల్లో సంబరాలు జరుపుకున్నారు.

రైతు బిడ్డకు మెరుగైన ర్యాంకు

సామాన్య రైతు కుమారుడు సత్తా చాటాడు. విద్యార్థి పాలగిరి సతీ్‌షరెడ్డి ఆలిండియా స్థాయిలో ఓపెన కేటగిరీలో 175వ ర్యాంకు సాధించాడు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన లక్ష్మీరెడ్డి కుమారుడు సతీ్‌షరెడ్డి జేఈఈ అడ్వాన్స పరీక్షల్లో 285 మార్కులు సాధించాడు. ఓపెన కేటగిరీలో 175వ ర్యాంకు సాధించడంతో...విద్యార్థి కుటుంబికులు హర్షం వ్యక్తం చేశారు. సతీ్‌షరెడ్డికి స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్నారు.

నారాయణలో...

జేఈఈ అడ్వాన్స ఫలితాల్లో నారాయణ జూనియర్‌ కళాశాల విద్యార్థి శశికిరణ్‌ 360 మార్కులకు గాను 234 మార్కులు సాధించడంతో విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల కోర్‌ డీన బద్రీనాథ్‌, డీన శ్రీనివాసరెడ్డి, డీజీఎం వెంకటరామిరెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఏ కాలేజీ లోని విద్యార్థులకు శశికిరణ్‌కు వచ్చిన ర్యాంకు రాలేదన్నారు. శశికిరణ్‌ ఆలిండియా ఓపెన కేటగిరీలో 982వ ర్యాంకు సాధించాడన్నారు. మేఘన 4,124వ ర్యాంకు, మోహన ప్రదీప్‌ 4,657వ ర్యాంకు, అజయ్‌ కృష్టారెడ్డి 5,287 ర్యాంకు, సిద్ధార్థరెడ్డి 16,145వ ర్యాంకు, అసిమ్‌ఖాన 17,929 ర్యాంకు ఆలిండియా స్థాయిలో సాధించారన్నారు. దీపిక 2,241, స్తుతి ప్రశంసిని 3713, రేణుక 4,658 ప్రిపరేటరీ ర్యాంకులు సాధించి క్వాలిఫై అయినట్లు తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు రవిశంకర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, హిమబిందు, శిఖామణి, లక్ష్మన్న, జయలక్ష్మి,బాలన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 10:19 PM