సమస్యలను పరిష్కరించే దాకా సమ్మె ఆగదు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:49 AM
ధర్మవరం, జనవరి 11: ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె ఆపేది లేదని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీదేవి అన్నారు.

- అంగనవాడీ కార్యకర్తలు, సహాయకుల యూనియన జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీదేవి
- 31వ రోజుకు చేరిన సమ్మె
ధర్మవరం, జనవరి 11: ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె ఆపేది లేదని ఏపీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీదేవి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగనవాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి31వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీదేవి మాట్లాడుతూ.. 31 రోజులుగా అంగనవాడీలు సమ్మె చేస్తుంటే.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పైపెచ్చు కక్షసాధింపుచర్యలకు దిగడం శోచనీయమన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు బయపడేప్రసక్తే లేదన్నారు. సమస్యలను పరిష్కరించేంతవరకు ఆందోళనను విరమించమని స్పష్టం చేశారు. ఈ సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ రైతుసంఘం జిల్లాఅధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, సీఐటీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌ఆదినారాయణ, అయూబ్‌ఖాన మద్దతు ప్రకటించారు.