Share News

మధ్యాహ్నం 2 గంటలకే సచివాలయం మూత

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:59 PM

మండల పరిధిలో దొడ్డేరి గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకే మూసి వేశారు. దీంతో వివిధ పనులపై వస్తున్న రైతులు, ప్రజలు వాటికి తాళం వేయడం చూసి, నిరాశతో వెనుదిరిగారు.

మధ్యాహ్నం 2 గంటలకే సచివాలయం మూత
మధ్యాహ్నం 2 గంటలకే తాళం వేసిన గ్రామ సచివాలయం

నిరాశతో వెనుదిరిగిన రైతులు, ప్రజలు

రొళ్ల, ఫిబ్రవరి 20: మండల పరిధిలో దొడ్డేరి గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకే మూసి వేశారు. దీంతో వివిధ పనులపై వస్తున్న రైతులు, ప్రజలు వాటికి తాళం వేయడం చూసి, నిరాశతో వెనుదిరిగారు. ప్రజలకు అందుబా టులో ఉండి సేవలందించాలని ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమలు చేస్తోందని, మరి ఆయా కార్యాలయాలను పనివేళల్లో తెరువకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సచివాలయం లోని సిబ్బంది సమయానికి హాజరు కారని, సరిగా విధులు నిర్వహించరని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇనచార్జ్‌ పంచాయతీ సెక్రెటరీ వివరణ కోరగా... సచివాలయంలోని ముగ్గురు సిబ్బంది బీఎల్‌ఓలుగా పనిచేస్తున్నారని తెలిపారు. దీంతో వారు విధులపై బయటకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. సచివాలయంలో సిబ్బంది కొరత ఉందని ఆయన తెలియజేశారు. ఈ కేంద్రానికి అన్ని శాఖల అధికారులను నియమించాలని ఆ గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:59 PM