Share News

వజ్రాల కోసం అన్వేషణ

ABN , Publish Date - May 19 , 2024 | 12:09 AM

ప్రతియేటా తొలకరి వర్షాలు మొదలవగానే వజ్రకరూరు ప్రాంతం కొత్త వ్యక్తులతో కళకళ లాడుతుంది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో స్థానిక ప్రజలతోపాటు కడప, గుంతకల్లు, పామిడి, గార్లదిన్నె, ఉరవకొండ, అనం

వజ్రాల కోసం అన్వేషణ
searching for diamonds

సుదూర ప్రాంతాల నుంచి జనం రాక

సందడిగా మారిన వజ్రకరూరు పరిసర పొలాలు

ఉరవకొండ, మే 18: ప్రతియేటా తొలకరి వర్షాలు మొదలవగానే వజ్రకరూరు ప్రాంతం కొత్త వ్యక్తులతో కళకళ లాడుతుంది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో స్థానిక ప్రజలతోపాటు కడప, గుంతకల్లు, పామిడి, గార్లదిన్నె, ఉరవకొండ, అనంతపురం, గుత్తి, మదనపల్లి, కర్ణాటక ప్రాంతాల నుంచి ప్రజలు తెల్లవారుజామునే టిఫిన, భోజన కారియర్లతో వజ్రకరూరుకు చేరుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయభూముల్లో వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. కొద్దిగా మెరుస్తూ వజ్రంలాగా కనిపించిన ప్రతి రాయిని సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో లభించే వజ్రాలు అత్యంత విలువైనవిగా చెబుతుంటారు. రూ.లక్ష మొదలుకొని రూ.20లక్షలకు విలువ చేసే వజ్రాలు లభిస్తున్నట్లు సమాచారం.

Updated Date - May 19 , 2024 | 12:09 AM