ELECTRICITY METER: మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:07 AM
జిల్లాలో ఉన్న విద్యుత మీటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, అధ్యక్షుడు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ ఆఫీ్‌సలో ఏపీ విద్యుత మీటర్ రీడర్ల యూనియన జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
అనంతపురం విద్య, జూలై 14: జిల్లాలో ఉన్న విద్యుత మీటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, అధ్యక్షుడు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ ఆఫీ్‌సలో ఏపీ విద్యుత మీటర్ రీడర్ల యూనియన జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపాలని యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు ఇస్తున్న రెమ్యూనరేషన ఒప్పందంలో ఉన్నదానికి, చేతికి ఇస్తున్నదానికి పొంతన లేదన్నారు. ఈపీఎఫ్, ఈఎ్‌సఐ కూడా జమ చేయడం లేదనిన్నారు. ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారికి న్యాయం చేయకుంటే ఏఐటీయూసీ తరపున పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా రాజారెడ్డి, సలహాదారుడిగా రాజే్‌షగౌడ్, అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం, ప్రధానకార్యదర్శి రా ము, కోశాధికారిగా దస్తగిరి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ షాన్వాజ్, జా యింట్ సెక్రెటరీగా సలీంను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కోశాధికారి రమే్‌షబాబు, ఏపీఎస్పీడీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.