Share News

kutami : దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

ABN , Publish Date - May 12 , 2024 | 12:29 AM

టీడీపీ మాజీ కౌన్సిలర్‌ మాదన ఉమామహేశ్వరి, ఆమె కుటుంబసభ్యులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పట్టణంలోని కూటమి శ్రేణులు డిమాండ్‌ చేశారు.

 kutami : దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

- కూటమి శ్రేణుల డిమాండ్‌

ధర్మవరం, మే 11: టీడీపీ మాజీ కౌన్సిలర్‌ మాదన ఉమామహేశ్వరి, ఆమె కుటుంబసభ్యులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పట్టణంలోని కూటమి శ్రేణులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు శనివారం నల్లతువాళ్లు భుజంపై వేసుకుని స్థానిక కొత్తపేటలోని మాదన ఉమామహేశ్వరి నివాసం వద్ద నుంచి గాంధీనగర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ కొద్దిసేపు ఆందోళన చేశారు.


అనంతరం వైసీపీ వారికి మంచి బుద్ధి ప్రసాదించమని గాంధీవిగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తర్వాత బాధితురాలు మాదన ఉమా మహేశ్వరి మాట్లాడుతూ.. మా వార్డుతో ఎటువంటి సంబంఽధం లేని వ్యక్తులు మా ఇంటికి వచ్చి తనను, తన భర్తతో పాటు పిల్లలను సైతం బయటకు ఈడ్చి మారణాయుధాలతో దాడి చేశారని వాపోయారు. ధర్మవరంలో వైసీపీ గుండాయిజానికి ఎదురులేకుండా పోతోందన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బీసీలనే టార్గెట్‌ చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు గిర్రాజునగేశ, జింకా రామాంజినేయులు, ్థలోకేశ, పరిశేసుధాకర్‌, మాదన సుబ్బయ్య, శీలామూర్తి, బాబాఫకృద్దీన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:29 AM