Share News

సచివాలయం ఖాళీ..!

ABN , Publish Date - May 17 , 2024 | 12:05 AM

మండలకేంద్రంలోని సచివాలయం ఉద్యోగులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. సమయపాలన పాటించట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

సచివాలయం ఖాళీ..!

గాండ్లపెంట, మే 16: మండలకేంద్రంలోని సచివాలయం ఉద్యోగులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. సమయపాలన పాటించట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయంలో వివిధరకాల పదవుల్లో 11 మంది సిబ్బందిని నియమించారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, వనబీలు తదితరాల కోసం నిత్యం జనం సచివాలయానికి వస్తుంటారు. ఉద్యోగులు అందుబాటులో లేకపోతుండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ తలుపులను వలంటీర్లు తెరవాల్సి వస్తోంది. సాయంత్రం వారే మూయాల్సి వస్తోంది. ఉదయం 10 గంటలకే సచివాలయం తెరవాలి. సిబ్బంది మొత్తం హాజరుకావాలి. సచివాలయ ఉద్యోగులు 11 గంటలైనా విధులకు రావట్లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి వెళితే సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గురువారం ఉదయం 11 గంటలైనా ఒకరో.. ఇద్దరో.. ఉద్యోగులు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. వివిధ పనుల నిమిత్తం గ్రామస్థులు ఫోనలో సంప్రదించగా.. కంప్యూటర్లు పనిచేయట్లేదని సమాధానం చెప్పినట్లు బాధితులు వాపోతున్నారు. మరికొంతమంది సిబ్బంది సెలవులో ఉన్నామని చెబుతున్నారట. పంచాయతీ కార్యదర్శి కూడా ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు. గొడ్డువెలగల కార్యదర్శి బాషాకు గాండ్లపెంట ఇనచార్జి బాధ్యతలు అప్పగించారు. మండలకేంద్రంలోని ప్రధాన రహదారిలో ఉన్న సచివాలయానికి తలుపులు తెరచివేసి, సిబ్బంది ఎవరూ లేకపోవడం పట్ల జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విలువైన వస్తువులు పోతే ఎవరు బాఽధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయంపై ఎంపీడీఓ రామానాయక్‌ను అడగ్గా.. వెటర్నరీ అసిస్టెంట్‌ కదిరికి బదిలీ ఆయ్యరనీ, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సెలవులో ఉన్నారన్నారు. మిగిలినవారు సెలవులో ఉన్నట్లు తనకు సమాచారం లేదని చెప్పుకొచ్చారు.

డీఎస్పీ చైతన్యపై

హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

ఫ టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ

అనంతపురం అర్బన, మే 16: జేసీ ప్రభాకర్‌రెడ్డి కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దాసరి కిరణ్‌పై దాడికి పాల్పడిన డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌తో కలిసి గురువారం ఆయన అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరి కిరణ్‌ను పరామర్శించారు. ఓడిపోతున్నామన్న అక్కసుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మూడు రోజులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. పెద్దారెడ్డి స్వయంగా దాడిలో పాల్గొన్నారని, ఎమ్మెల్యేని సకాలంలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. గతంలో తాడిపత్రిలో అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించిన డీఎస్పీ చైతన్యను రాజంపేట నుంచి తాడిపత్రికి రప్పించడం పైస్థాయిలో జరిగిన కుట్ర అని అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై డీఎస్పీ చైతన్య ఉద్దేశపూర్వకంగా దాడి చేయించారని, కంప్యూటర్‌ ఆపరేటర్‌ కిరణ్‌ను ఇంటి బయటకు తీసుకువెళ్లి దారుణంగా చితకబాదారని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటి దాకా ఎంఎల్‌సీ నమోదు చేయలేదని, బాధితుడి స్టేట్‌మెంట్‌ కూడా నమోదు చేయలేదని అన్నారు. పోలీసుల పక్షపాత వైఖరికి ఇదే నిదర్శనమని అన్నారు. సీఎం జగన, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షనలోనే తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తున్నారన్నారని ఆరోపించారు. పోలీసులే హింసకు ఒడిగడితే శాంతి భద్రతలను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. దళితుడు, దివ్యాంగుడైన కిరణ్‌ను డీఎస్పీ చైతన్య విచక్షణా రహితంగా కొట్టడం దారుణ మని వెంకటశివుడు యాదవ్‌ అన్నారు. తాడిపత్రిలో పనిచేసే సమయంలో డీఎస్పీ చైతన్య టీడీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకొని హింసించారని అన్నారు. అందుకే ఆయన్ను ఇక్కడి నుంచి బదిలీ చేశారని అన్నారు. తాడిపత్రిలో గొడవలు జరిగే సమయంలో పోలీసు బలగాల పేరుతో ఆయన్ను రప్పించి, టీడీపీ నాయకులపై దాడులు చేయించడం అప్రజాస్వామికమని అన్నారు. డీఎస్పీ చైతన్య కక్ష్యసాధింపు చర్యలపై విచారణ చేయించి, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తేనే పోలీసు వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారివెంట టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, నాయకులు గంజే నాగరాజు, లక్ష్మీనరసింహ, పోతుల లక్ష్మీనరసింహులు, కడియాల కొండన్న తదితరులు ఉన్నారు.

సా్ట్రంగ్‌రూములను పరిశీలించిన కలెక్టర్‌

అనంతపురం టౌన, మే 16: జేఎనటీయులోని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన సా్ట్రంగ్‌రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ గురువారం పరిశీలించారు. భద్రతా చర్యలు, డ్యూటీలు గురించి ఆరా తీశారు. భద్రత విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయరాదని, సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. కౌంటింగ్‌ వరకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:05 AM