Share News

కొత్త కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:30 AM

ఎన్నికల వేళ జిల్లాకు కొత్త కలెక్టర్‌, ఎస్పీ వచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరుగా డాక్టర్‌ వినోద్‌కుమార్‌ నియమితులయ్యారు. ఓటరు జాబితాలో అక్రమాలు, కోడ్‌ అమలు విషయంలో ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్‌ గౌతమిని కేంద్ర ఎన్నికల కమిషన బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు కొత్త కలెక్టరుగా డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.

కొత్త కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌

ఎస్పీగా అమిత బర్దార్‌ బాధ్యతలు..

కలెక్టర్‌ రాక ఆలస్యం.. నేడు బాధ్యతల స్వీకరణ

అనంతపురం టౌన/క్రైం, ఏప్రిల్‌ 4: ఎన్నికల వేళ జిల్లాకు కొత్త కలెక్టర్‌, ఎస్పీ వచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరుగా డాక్టర్‌ వినోద్‌కుమార్‌ నియమితులయ్యారు. ఓటరు జాబితాలో అక్రమాలు, కోడ్‌ అమలు విషయంలో ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్‌ గౌతమిని కేంద్ర ఎన్నికల కమిషన బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు కొత్త కలెక్టరుగా డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. జిల్లాకు ఆయన సుపరిచితులు. తొలుత ఎంబీబీఎస్‌ పూర్తిచేసి డాక్టర్‌ అయ్యారు. ఆ తరువాత 2004-05 ఐఏఎస్‌ బ్యాచకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లాలో ట్రైనీ కలెక్టరుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం ఏపీ స్కిల్‌డెవల్‌పమెంట్‌ కార్పొరేషన ఎండీగా, రంపచోడవరం సబ్‌ కలెక్టరుగా, నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టరుగా సేవలు అందించారు. పార్వతీపురం ట్రైబుల్‌ వెల్ఫేర్‌లోనూ కొన్నాళ్లు సేవలు అందించారు. గ్రామీణ తాగునీరు, మైన్స, ల్యాండ్‌ తదితర శాఖలలో పనిచేశారు. తాజాగా జిల్లా కలెక్టరుగా నియమితులయ్యారు. ఆయన గురువారం రాత్రి 8 గంటలకు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. కానీ జిల్లా కేంద్రానికి చేరుకునే సమయానికి అర్ధరాత్రి దాటుతుందని, శుక్రవారం బాధ్యతలు చేపడతారని కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల్లో ప్రశాంతతే లక్ష్యం..

సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే తన లక్ష్యమని కొత్త ఎస్పీ అమిత బర్దార్‌ అన్నారు. ఎస్పీ అన్బురాజన బదిలీ నేపథ్యంలో జిల్ల్లాలోని 14వ బెటాలియన కమాండెంట్‌గా ఉన్న అమిత బర్దార్‌ను ఎస్పీగా నియమిస్తూ ఎన్నికల కమిషన ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు అందిన కొన్ని గంటల్లోనే ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇనచార్జి ఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయనకు గురువారం బాధ్యత అప్పగించారు. అనంతరం పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో ఎస్పీ అమిత బర్దార్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగంతో కలిసి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తామని అన్నారు. సమస్యలు, సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటామని అన్నారు. ఎన్నికల వేళ జిల్లా ప్రజలకు, అభ్యర్థులకు సమస్యలుంటే సంబంధిత పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. రాజస్థానలోని జైపూర్‌కు చెందిన అమిత బర్దార్‌, 2014 ఐపీఎస్‌ బ్యాచ అధికారి. శిక్షణ అనంతరం ఏఎస్పీగా వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఎస్పీగా తొలిసారి శ్రీకాకుళం జిల్లాలో పనిచేశారు. అనంతరం సీఐడీలో పనిచేశారు. 14వ బెటాలియన కమాండెంట్‌గా పనిచేస్తూ ఎస్పీగా నియమితుడయ్యారు.

Updated Date - Apr 05 , 2024 | 12:30 AM