Share News

FAILURE : ఇండోర్‌ స్టేడియం ఆగిపోయింది..!

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:50 PM

నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్‌ కళాశాల మైదానం లో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపో యింది. దీంతో తమ ప్రతిభ చాటుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని ఆశ పడిన మడకశిర క్రీడాకారు ఆశలు అడియాశలయ్యాయి. ఉమ్మడి జిల్లాలోనే మారు మూల ప్రాంతమైన మడకశిరలోని పాఠశాలలు, కళా శాలలకు సరైన క్రీడా మైదానాలు లేవు. దీంతో క్రీడాకా రులు తమ ప్రతిభను చాటు కునేందుకు ఇబ్బందులు పడేవారు. ఇలాంటి తరణంలో అప్పటి టీడీపీ ప్రభు త్వం మడకశిరకు ఇండోర్‌ స్టేడియం మంజూరుచేసిం ది.

FAILURE : ఇండోర్‌ స్టేడియం ఆగిపోయింది..!
Half blown indoor stadium construction

టీడీపీ హయాంలో 90 శాతం నిర్మాణం

వైసీపీ పాలనలో పూర్తికాని పదిశాతం పనులు

నిరాశలో మడకశిర క్రీడాకారులు

మడకశిర టౌన, ఏప్రిల్‌ 24: నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్‌ కళాశాల మైదానం లో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపో యింది. దీంతో తమ ప్రతిభ చాటుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని ఆశ పడిన మడకశిర క్రీడాకారు ఆశలు అడియాశలయ్యాయి. ఉమ్మడి జిల్లాలోనే మారు మూల ప్రాంతమైన మడకశిరలోని పాఠశాలలు, కళా శాలలకు సరైన క్రీడా మైదానాలు లేవు. దీంతో క్రీడాకా రులు తమ ప్రతిభను చాటు కునేందుకు ఇబ్బందులు పడేవారు. ఇలాంటి తరణంలో అప్పటి టీడీపీ ప్రభు త్వం మడకశిరకు ఇండోర్‌ స్టేడియం మంజూరుచేసిం ది.


అప్పట్లో రూ.2 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఈ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే నిపుణులైన కోచలను నియమించి అవసరమైన క్రీడాసామాగ్రిని సమకూర్చితే ఇక్కడి క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ రాణించేందుకు అవకాశముందని భావించారు. ప్రతిభను చాటుకునేం దుకు మంచి అవకాశం ఏర్పడుతోందని ఇక్కడి క్రీడాకారులు అశ పడ్డారు. ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పూర్తి అయితే చెస్‌, క్యారమ్‌, షటిల్‌ బ్యాడ్మింటన, టెన్నికాయిట్‌ తదితర క్రీడల్లో నైపుణ్య సాధించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇండోర్‌ స్టేడియం ఆవరణంలో విశాలమైన క్రీడా మైదానంలో క్రికెట్‌, వాలీ బాల్‌, బ్యాడ్మింటన, రన్నింగ్‌రేస్‌ వంటి ఎన్నో క్రీడలు అడేందుకు అవకాశం ఉండే ది.


క్రీడల్లో మంచి నైపుణ్యం పెంపొందిం చుకునే యువతకు ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండడంతో ఈ ప్రాంత యువ తకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యువత, ప్రజలు ఎంతో సంతోషించారు. ఇండోస్టేడియం నిర్మాణం ఈ ప్రాంత క్రీడాకారులకు అదృష్టంగా బావించారు. స్థానిక క్రీడాకారుల కల నెరవేర్చేందుకు నిధులు మంజూరు చేసి, శరవేగంగా దాదాపు 90శాతం పనులు పూర్తి చేశారు. అనంతరం వైసీసీ అధికారంలోకి వచ్చింది. మిగిలిన కేవలం 10శాతం పనులు పూర్తి చేయలేకపోవడంతో స్టేడియం నిర్మాణం అర్ధంతరంగా అగిపోయింది. దీంతో మడకశిర నియోజకవర్గంలోని క్రీడకారుల అశ నేరవేరలేదు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2024 | 11:50 PM