Share News

ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:32 PM

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అంగనవాడీ మహిళలు 21రోజులుగా నిరసన తెలుపుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని అం గనవాడీలు ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు
లేపాక్షిలో కోలాటం ఆడుతూ నిరసన

అంగనవాడీల ధ్వజం.. కొనసాగిన నిరసనలు

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అంగనవాడీ మహిళలు 21రోజులుగా నిరసన తెలుపుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని అం గనవాడీలు ఆవేదన వ్యక్తంచేశారు. అంగనవాడీల సమ్మెపై ప్రభుత్వం స్పం దించి తగు నిర్ణయం తీసుకోక పోవడం దారుణమని మండిపడ్డారు. నూ తన సంవత్సరం మొదటి రోజు అయినా సమ్మెలో భాగంగా వారు సోమ వారం నిరసన చేపట్టారు. హిందూపురంలోని పాత బీపీఎల్‌ షోరూమ్‌ వద్ద శిబిరంలో నిరసన కొనసాగించారు. అలాగే పెనుకొండలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. గోరంట్లలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చెమ్మచెక్క ఆడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రిలేదీక్షలను కొనసాగించారు. లేపాక్షి తహసీ ల్దార్‌ కార్యాలయం ఆవరణంలో కోలాటం ఆడుతూ ప్రభుత్వానికి వ్యతిర ేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు నిరసన లు కొనసాగిస్తామన్నారు. చిలమత్తూరులో ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అంగనవాడీల నిరసనకు సీఐటీయూ, రైతు సంఘం, వ్య వసాయ కార్మిక సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు.

Updated Date - Jan 01 , 2024 | 11:32 PM