టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:17 AM
టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి జేసీ అశ్మిత రెడ్డి అన్నారు. పట్టణంలోని పడమటిగేరిలో గురువారం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.
తాడిపత్రిటౌన, మార్చి7: టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి జేసీ అశ్మిత రెడ్డి అన్నారు. పట్టణంలోని పడమటిగేరిలో గురువారం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో నెలకొన్న అండర్‌డ్రైనేజీ, మంచినీటి సమస్య గురించి మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. మున్సిపల్ వైస్‌చైర్మన్లు సరస్వతి, అబ్దుల్‌రహీం, టీడీపీ కౌన్సిలర్లు విజయ్‌కుమార్, మల్లికార్జున, షెక్షావలి, జింకా లక్ష్మిదేవి, రేష్మాపర్వీన, జ్యోతి, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దపప్పూరు: పెద్దవడుగూరు: మండలకేంద్రంలోని చేనేత కాలనీలో గురువారం జేసీ అశ్మితరెడ్డి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, మాజీ జడ్పీటీసీ చిరంజీవులు పాల్గొన్నారు.
రానున్నది టీడీపీ ప్రభుత్వమే
ఉరవకొండ: రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనయుడు విక్రమ్‌సింహ ధీమా వ్యక్తం చేశారు. వజ్రకరూరు మండలంలోని తట్రగల్లు గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సూపర్‌సిక్స్ పథకాల కరపత్రాలను అందజేశారు. రానున్న ఎన్నికల్లో కేశవ్‌కు మద్ధతు ఇవ్వాలని ప్రజలను కోరారు. నూతేటి వెంకటేశులు, మాజీ ఎంపీపీ వెంకటమ్మ, మాజీ జడ్పీటీసీ తులసీదాస్, సుధాకర్, వలి, నాగేంద్ర, ఎర్రిస్వామి, అనంతయ్య, ధనుంజయ, వన్నూరప్ప, విజయ్ పాల్గొన్నారు. అలాగే విడపనకల్లు మండలంలోని డొనేకల్లు గ్రామంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేశవ్ తనయుడు విజయ్‌సింహ పాల్గొన్నారు. సూపర్‌సిక్స్ పథకాల వలన కలిగే లబ్ధిని ప్రజలకు వివరించారు. మిర్చి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల కన్వీనర్ మారయ్య, భీమలింగ, శ్రీనివాసులు పాల్గొన్నారు.