చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:55 PM
వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పా డాలన్నా రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగాలన్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని జిల్లా మైనారిటీ అధ్యక్షుడు భక్తర్, పట్టణ అధ్యక్షుడు మనోహర్ అన్నారు.

మడకశిరటౌన, జనవరి 12: వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పా డాలన్నా రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగాలన్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని జిల్లా మైనారిటీ అధ్యక్షుడు భక్తర్, పట్టణ అధ్యక్షుడు మనోహర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 15వ వార్డులో బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలకు సం క్షేమ ఫలాలు అందాలన్నా, అన్నివర్గాలకు న్యాయం జరగాలన్నా ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం అన్నారు. వైసీపీ పాలనలో కొందరికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. పట్టణ అధ్యక్షుడు తిమ్మరాజు, కౌన్సిలర్ నరసింహరాజు, బూత కన్వీనర్ రామాంజనేయులు, శశికుమార్ పాల్గొన్నారు.