TREES : మాయమౌతున్న మన్రో తోపు
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:27 AM
నాడు పచ్చదనం, ఆహ్లాదానికి మారు పేరుగా నిలిచిన కోడూరు మన్రో తోపు నేడు మాయమైపోతోంది. రోడ్ల విస్తరణలో భా గంగా 20 ఏళ్లుగా మహా వృక్షాలు నేలకొరిగి పోయా యి. దీంతో వందల సంవత్సరాలుగా కోడూరు అంటే టక్కున గుర్తుకు వచ్చే విప్ప చెట్ల సమూహం పూర్తి గా కనుమరుగైపోయిందనే చెప్పవచ్చు. అప్పటి బ్రి టీష్ పాలనలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఽథామస్ మన్రో దొర కోడూరు సమీపంలో కుషావతి నది పక్క న 44వ జాతీయ రహదారికి ఇరువైపులా ఒక వరుస క్రమంలో వందల సంఖ్యలో విప్ప, చింత మొక్కల ను నాటించారు.

చిలమత్తూరు, జూన 16: నాడు పచ్చదనం, ఆహ్లాదానికి మారు పేరుగా నిలిచిన కోడూరు మన్రో తోపు నేడు మాయమైపోతోంది. రోడ్ల విస్తరణలో భా గంగా 20 ఏళ్లుగా మహా వృక్షాలు నేలకొరిగి పోయా యి. దీంతో వందల సంవత్సరాలుగా కోడూరు అంటే టక్కున గుర్తుకు వచ్చే విప్ప చెట్ల సమూహం పూర్తి గా కనుమరుగైపోయిందనే చెప్పవచ్చు. అప్పటి బ్రి టీష్ పాలనలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఽథామస్ మన్రో దొర కోడూరు సమీపంలో కుషావతి నది పక్క న 44వ జాతీయ రహదారికి ఇరువైపులా ఒక వరుస క్రమంలో వందల సంఖ్యలో విప్ప, చింత మొక్కల ను నాటించారు.
ఆయన నాటించిన మొక్కలు ప్రస్తు తం మహా వృక్షాలయ్యాయి. సుమారు 14 ఎకరాల వి స్తీర్ణంలోని ఈ తోపు నిత్యం పచ్చదనంతో కళకళలా డేది. ఎంతో ఆహ్లాదాన్నిచ్చే ఈ తోపులో జాతీయ రహ దారిపై వెళ్లే ప్రయాణికులు, స్థానికులు సేద తీరువా రు. పచ్చని చెట్లతో కళకళలాడే మన్రో తోపు ఇప్పుడు రోడ్ల విస్తరణలో కనుమరు గైపోతోంది. గతంలో 44వ జాతీయ రహదారిని విస్త రించే క్రమంలో ఈ తోపులో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను కూకటి వేళ్లతో పెకలించేశా రు. ఇప్పుడు కోడూరు తోపు నుంచి పుట్టపర్తికి వెళ్లే రహ దారిని నాలుగు లేన్ల రహ దారిగా మార్చడంతో ఆ ప నులు చురుగ్గా జరుగుతు న్నాయి. ఇందులో భాగంగా ఈ మన్రో తోపులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఇలా మన్రో తోపునకు రోడ్ల విస్తరణ పనులు శాపంగా మా రాయనే చెప్పవచ్చు. దీంతో వందల ఏళ్లుగా పచ్చద నానికి పేరుగాంచిన మన్రో తోపు పూర్తిగా తెర మరుగైనట్లేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పెరిగిన ఆక్రమణలు
రోడ్ల విస్తరణకు తోడు కొంత కాలంగా మన్రో తోపు లో ఆక్రమణలు కూడా అధికంగా పెరిగాయి. పచ్చని చెట్ల స్థానంలో నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. దీ ని కారణంగా పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి, నాడు వేల సంఖ్యలో ఉన్న చెట్లు ఆక్రమణలతో ప దుల సంఖ్యకు చేరాయి. మన్రోతోపును సంరక్షించాల్సి న అధికారులు వారి కళ్లెదుటే ఆక్రమణలు జరుగు తున్నా పట్టించుకోవంలేదన్న విమర్శలు వినవస్తు న్నాయి. ఈ తోపు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉం ది. పంచాయతీ వారు సరిహద్దులను గుర్తించి కంచె ఏర్పాటుచేయకపోవడంతో కొందరు మన్రోతోపు శి వార ప్రాంతాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడుతు న్నారు. ఇప్పటికైనా వందల సంవత్సరాల నాటి మ న్రో పేరును నిలబెట్టి కూలిన పచ్చని చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....